తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రేపే శివసేన శాసనసభాపక్ష నేత ఎన్నిక - రేపే శివసేన శాసనసభాపక్ష నేత ఎన్నిక

మహారాష్ట్రలో భాజపా శాసనసభాపక్ష నేతగా ఫడణవీస్​ ఇవాళ ఎన్నికయ్యారు. ఈ తరుణంలో రేపు తమ పార్టీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోవడానికి సిద్ధపడుతోంది శివసేన. ఇందుకోసం సెంట్రల్​ ముంబయిలోని సేన భవన్​కు ఇటీవలే జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన పార్టీ ఎమ్మెల్యేలు తరలివెళ్లనున్నారు. భాజపా-శివసేన మధ్య ప్రతిష్టంభన కొనసాగుతుండటం వల్ల ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.

SHIVA SENA TO ELECT ITS PARTY LEADER IN HOUSE TOMMORROW

By

Published : Oct 30, 2019, 7:24 PM IST

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై భాజపా-శివసేన కూటమి మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. రేపు శాసనసభాపక్ష నేతను ఎన్నుకోవాలని నిర్ణయించింది శివసేన. ఈ మేరకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సెంట్రల్ ముంబయిలోని సేన భవన్‌లో సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

మహారాష్ట్ర అధికారం విషయంలో చెరిసగం ఫార్ములాను పాటించాలని శివసేన గట్టిగా కోరుతున్నప్పటికీ.. అందుకు భాజపా అంగీకరించడం లేదు. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో భాజపా 105, శివసేన 56 సీట్లు గెలుచుకున్నాయి. ఇటీవలే ఆరుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు చేరడం వల్ల శివసేన బలం 62కు చేరింది. ప్రతిపక్ష ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44 స్థానాలు కైవసం చేసుకున్నాయి.

భాజపా దూకుడు...

ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు దేవేంద్ర ఫడ్నవిస్‌ సిద్ధమవుతున్నారు.భాజపా శాసనసభాపక్ష నేతగా ఆయనను భాజపా ఎమ్మెల్యేలు ఇవాళ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

మరోసారి శాసనసభ పక్షనేతగా ఎన్నికైన ఫడణవీస్.. మిగిలిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. శివసేన అధినేత ఉద్ధవ్​ ఠాక్రేకూ ధన్యవాదాలు చెప్పారు.

ఇదీ చూడండి- త్వరలో మహాకూటమి ప్రభుత్వం: ఫడణవీస్

ABOUT THE AUTHOR

...view details