ఈ నెల 5న జరిగిన అయోధ్య రామమందిర భూమిపూజలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో వేదిక పంచుకున్న శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్‌కు కరోనా సోకడం సర్వత్రా చర్చనీయాంశమైంది. తాజాగా.. ఈ విషయాన్ని తన అధికార పత్రిక సామ్నాలో ప్రస్తావించిన శివసేన.. మరి ఇప్పుడు ప్రధాని మోదీ క్వారంటైన్ నిబంధనలను పాటిస్తారా? అని ప్రశ్నించింది.
"భూమిపూజ సందర్భంగా 75ఏళ్ల గోపాల్ దాస్ వేదికపైనే ఉన్నారు. ఆయన మాస్కు కూడా వేసుకోలేదు. ఆయనను ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ కలిశారు. ప్రధాని.. గోపాల్ దాస్ చేతులను కూడా పట్టుకున్నారు. మరి ఇప్పుడు మన ప్రధాని క్వారంటైన్ అవుతారా?"