తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సేన-ఎన్సీపీ-కాంగ్రెస్​ సర్కార్ 6 నెలల ముచ్చటే' - మహారాష్ట్రలో కూటమి ప్రభుత్వంపై గడ్కరీ విమర్శలు

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన, కాంగ్రెస్, ఎన్​సీపీ కూటమిగా ఏర్పడుతుండడంపై భాజపా నేత, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ విమర్శలు గుప్పించారు. సైద్ధాంతికంగా భిన్నమైన ఈ పార్టీల కూటమి 6 నుంచి 8 నెలలకు మించి ప్రభుత్వాన్ని నడుపలేదని అభిప్రాయపడ్డారు. కేవలం భాజపాను అధికారం నుంచి దూరం చేయడానికే అనైతిక పొత్తులు కుదుర్చుకుంటున్నాయని మండిపడ్డారు.

'సేన-ఎన్సీపీ-కాంగ్రెస్​ సర్కార్ 6 నెలల ముచ్చటే'

By

Published : Nov 22, 2019, 3:58 PM IST

Updated : Nov 22, 2019, 4:51 PM IST

శివసేన, కాంగ్రెస్, ఎన్​సీపీ కూటమిగా ఏర్పడడం పూర్తిగా అవకాశవాదమని భాజపా నేత, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ విమర్శించారు. వీరు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుచేసినా.. అది 6 నుంచి 8 నెలలు దాటి మనలేదని జోస్యం చెప్పారు.

ప్రస్తుతం ఝార్ఖండ్​ ఎన్నికల ప్రచారంలో ఉన్న నితిన్​ గడ్కరీ.. శివసేన, కాంగ్రెస్, ఎన్​సీపీ పొత్తు ప్రయత్నాలను తప్పుబట్టారు.

'సేన-ఎన్సీపీ-కాంగ్రెస్​ సర్కార్ 6 నెలల ముచ్చటే'

"శివసేన అవసరాలకు ఎన్సీపీ కూడా విలువనివ్వదు. చర్చలు, సిద్ధాంతాల ఆధారంగా ఈ కూటమి ఏర్పడలేదు. వారిది(శివసేన, కాంగ్రెస్​, ఎన్​సీపీ) అవకాశవాద కూటమి. ఇది మంచిది కాదు. మహారాష్ట్రలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయలేరు. ఒక వేళ ఇలాంటి ప్రభుత్వం వస్తే మహారాష్ట్రకు నష్టం వాటిల్లుతుంది. అస్థిరమైన ప్రభుత్వం మహారాష్ట్రకు మంచిది కాదు. "- నితిన్ గడ్కరీ, భాజపా నేత, కేంద్రమంత్రి

ప్రభుత్వం ఏర్పాటుకు సన్నద్ధం

ముఖ్యమంత్రి పీఠం విషయమై భాజపా, శివసేన మధ్య విబేధాలు రావడం వల్ల మహారాష్ట్రలో ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పాటుకాలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం కనీస ఉమ్మడి కార్యక్రమం రూపొందించే పనిలో శివసేన, కాంగ్రెస్, ఎన్​సీపీ ఉన్నాయి.

కూటమి విఫలమైతే..

కూటమి విఫలమైతే భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా? అనే ప్రశ్నకు.. అలాంటి పరిస్థితుల్లో భవిష్యత్​ వ్యూహాన్ని పార్టీ నిర్ణయిస్తుందని గడ్కరీ స్పష్టం చేశారు. క్రికెట్​లోనూ, రాజకీయాల్లోనూ ఎప్పుడు ఏమైనా జరగవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎన్​సీపీ అధినేత శరద్​పవార్​, ప్రధాని నరేంద్రమోదీ మధ్య జరిగిన సమావేశం గురించి తనకు ఏమీ తెలియదని గడ్కరీ అన్నారు.

ఇదీ చూడండి: 'గాంధీ'ల కోసం వచ్చేవారం లోక్​సభలో 'ప్రత్యేక' బిల్లు

Last Updated : Nov 22, 2019, 4:51 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details