మహారాష్ట్రలో రైతుల సమస్యలపై చర్చించడానికి శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నాయకులు రేపు గవర్నర్ను కలవనున్నారు. ఈ మేరకు ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ వెల్లడించారు.
మహా రాజకీయం: రేపు గవర్నర్ వద్దకు ఎన్సీపీ-శివసేన-కాంగ్రెస్ - latest news of Maharashtra politics
మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతోన్న వేళ... ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర గవర్నర్ను రేపు కలవనున్నారు. ఈ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

రేపు గవర్నర్ను కలవనున్న ఎన్సీపీ-సేన-కాంగ్రెస్
ఐదేళ్లు మేమే...
మహారాష్ట్రలో అధికారం చేపట్టడంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ప్రక్రియ మొదలైందని, తమ సర్కారు 5 ఏళ్ల పాటు ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.