తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వ్యవసాయ బిల్లులను ఆమోదించొద్దని రాష్ట్రపతికి వినతి'

పార్లమెంటు ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులను.. తిరస్కరించాలని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ను విన్నవించారు శిరోమణి అకాలీదళ్​ అధ్యక్షుడు సుఖ్​బీర్​ సింగ్​ బాదల్​. పునఃపరిశీలనకు వాటిని మళ్లీ పార్లమెంటుకు పంపాలని కోరారు.

By

Published : Sep 20, 2020, 8:03 PM IST

Updated : Sep 20, 2020, 9:42 PM IST

Don't sign farm bills, Sukhhbir Badal urges President
'రామ్‌నాథ్‌జీ.. వ్యవసాయ బిల్లులను ఆమోదించొద్దు'

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు ఆమోదముద్ర వేయొద్దని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ కోరారు. రెండు వ్యవసాయ బిల్లులు పార్లమెంట్‌ ఆమోదం పొందిన నేపథ్యంలో ఆ బిల్లులను వెనక్కి పంపాలని రాష్ట్రపతికి విన్నవించారు.

"రైతులకు సంబంధించిన బిల్లులపై సంతకం చేయొద్దని రాష్ట్రపతిని కోరుతున్నా. వాటిని పునః పరిశీలన నిమిత్తం పార్లమెంట్‌కు పంపాలని వేడుకొంటున్నా. రైతులు, కూలీలు, దళితుల శ్రేయస్సు కోసం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థిస్తున్నా"

-- సుఖ్‌బీర్‌ సింగ్‌, శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు

ఈ బిల్లులు చట్ట రూపం దాల్చితే రైతులు మనల్ని క్షమించరని అన్నారు సుఖ్​బీర్​. ప్రజాస్వామ్యం అంటే ఏకాభిప్రాయం అని, అణచివేత కాదు అని పేర్కొన్నారు.

వ్యవసాయానికి సంబంధించి 'ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌ బిల్లు, ఫార్మర్స్‌ అగ్రిమెంట్‌ ఆన్ ప్రైస్‌ అస్యూరెన్స్‌ అండ్ ఫార్మర్స్‌ సర్వీసు' బిల్లులకు ఇవాళ పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ ఇప్పటికే శిరోమణి అకాలీదళ్​ నేత హర్‌సిమ్రత్‌ సింగ్‌ బాదల్‌ తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. మరోవైపు ఈ బిల్లులను రైతు సంఘాల నాయకులు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు.

ఇదీ చూడండి: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లుల్లో ఏముందంటే?

Last Updated : Sep 20, 2020, 9:42 PM IST

ABOUT THE AUTHOR

...view details