తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శిరిడీ: బంద్​ ప్రశాంతం.. ఆలయం కిటకిట - shirdi bundh news

సాయిబాబా జన్మస్థానంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో శిరిడీవాసులు పిలుపునిచ్చిన బంద్‌ ప్రశాంతంగా సాగుతోంది. శిరిడీ సహా చుట్టుపక్కల 25 గ్రామాల్లోని దుకాణాలు, కార్యాలయాలు మూతపడ్డాయి. రవాణా వ్యవస్థ నిలిచిపోయింది.  అయితే ఆలయ దర్శనాలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి.

shirdi-bandh
శిరిడీకి పోటెత్తిన భక్తులు... ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్​

By

Published : Jan 19, 2020, 1:53 PM IST

మహారాష్ట్ర శిరిడిలో బంద్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. శిరిడీ సహా చుట్టుపక్కల 25 గ్రామాలు ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌ పాటిస్తున్నారు. దుకాణాలు, పాఠశాలలు, హోటళ్లు మూతపడ్డాయి. కార్యకలాపాలు స్తంభించి వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. అయితే ఆలయ దర్శనాలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి.

ఆదివారం ఉదయం భక్తులు భారీ ఎత్తున బాబా దర్శనానికి తరలివచ్చారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ‘సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌’ అన్ని ఏర్పాట్లు చేసింది.

ముందుగానే హోటళ్లు బుక్​ చేసుకున్న భక్తుల కోసం సేవలు అందుబాటులో ఉంచారు. ఎయిర్​ పోర్ట్​ నుంచి ఆలయం వరకు క్యాబ్​లను, ఇతర గ్రామాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను అనుమతిస్తున్నారు.

బంద్​కు తాము పూర్తి మద్దుతు ఇచ్చినట్లు తెలిపారు మహారాష్ట్ర మాజీ మంత్రి, భాజపా నేత వీ.కే పాటిల్.

ఇదీ జరిగింది

పర్భాణీ జిల్లా పాథ్రీలోని సాయి జన్మస్థానంలో వసతుల కల్పనకు రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఇటీవల ప్రకటించాక వివాదం తెరపైకి వచ్చింది. పాథ్రీ సాయిబాబా జన్మస్థలమని చెప్పేందుకు ఆధారాల్లేవని శిర్డీ వాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వివాదాన్ని పరిష్కరించేందుకు సంబంధీకులందరితో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సోమవారం సమావేశం కానున్నట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

శిరిడీకి పోటెత్తిన భక్తులు... ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్​

ABOUT THE AUTHOR

...view details