తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శివసేన శాసనసభాపక్షనేతగా ఏకనాథ్ శిందే - maharastra latest news

శివసేన శాసనసభాపక్ష నేతగా ఏకనాథ్​ శిందే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శిందే పేరును పార్టీ నేత ఆదిత్య ఠాక్రే ప్రతిపాదించగా ఇతర సభ్యులు బలపరిచారు.

MH-SENA-LEADER

By

Published : Oct 31, 2019, 2:18 PM IST

Updated : Oct 31, 2019, 3:07 PM IST

మహారాష్ట్రలో శివసేన శాసనసభాపక్ష నేతగా ఏక్‌నాథ్‌ శిందే ఎన్నికయ్యారు. ముంబయిలో పార్టీ అధినేత ఉద్ధవ్​ ఠాక్రే నేతృత్వంలో జరిగిన శాసన సభ్యుల సమావేశంలో శిందేను ఎన్నుకున్నారు.

శిందే పేరును ఉద్దవ్‌ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే ప్రతిపాదించగా, ఇతర సభ్యులు బలపర్చారు. ముందుగా ఆదిత్యనే పక్షనేతగా ఎన్నుకుంటారని ప్రచారం జరిగినప్పటికీ.. ఉద్ధవ్ ఠాక్రే ఇందుకు నిరాకరించినట్లు సమాచారం.

గవర్నర్​తో భేటీ

సమావేశం పూర్తయ్యాక మధ్యాహ్నం 6.15 గంటలకు మహారాష్ట్ర గవర్నర్​ భగత్​సింగ్ కోషియారిని శివసేన నేతలు కలవనున్నారు. వీరిలో ఆదిత్య ఠాక్రే, ఏకనాథ్ శిందే, దివాకర్ రావోటే, సుభాశ్ దేశాయి తదితరులు ఉన్నారు. ఈ భేటీలో ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరదల కారణంగా నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్​ చేయనున్నట్లు సమాచారం.

Last Updated : Oct 31, 2019, 3:07 PM IST

ABOUT THE AUTHOR

...view details