దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ మరణం దేశవ్యాప్తంగా ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. గొప్ప నేతను కోల్పోయామని రాజకీయనేతలు, సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.
రాష్ట్రపతి విచారం
"షీలా దీక్షిత్ మరణ వార్త బాధ కలిగించింది. ఒక సీనియర్ రాజకీయ వేత్తను కోల్పోయాం. రాజధాని ముఖచిత్రం మారడంలో షీలా కృషి గుర్తుంచుకోదగినది."
-రామ్నాథ్ కోవింద్, రాష్ట్రపతి
ప్రధాని దిగ్భ్రాంతి
"షీలాజీ మరణం ఎంతో బాధించింది. ఆమెది స్నేహపూర్వక వ్యక్తిత్వం. దిల్లీ అభివృద్ధిలో ఆమె భాగస్వామ్యం మరువలేం. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి."
-ప్రధాని నరేంద్రమోదీ
ఎంతో బాధించింది: రాహుల్
షీలా మరణంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా ఇతర అగ్రనేతలు విచారం వ్యక్తం వేశారు.
"షీలాజీ మరణం ఎంతో బాధించింది. ఆమె కాంగ్రెస్ ప్రియ పుత్రిక. మూడు సార్లు దిల్లీ సీఎంగా ఎన్నికయి.. రాజధానికి ఎంతో సేవ చేశారు."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు
"మీరు లేరన్న మాట ఎంతో బాధను కలిగిస్తోంది. జీవితాంతం కాంగ్రెస్ వ్యక్తిగా ఉన్నారు. 3 సార్లు సీఎంగా దిల్లీ ముఖచిత్రాన్నే మార్చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి."
-కాంగ్రెస్
"వార్త తెలియగానే నిశ్చేష్ఠుడినయ్యాను. ఆమె మరణంతో బాధ్యాతాయుతమైన కాంగ్రెస్ నాయకురాలిని కోల్పోయాం. దిల్లీ అభివృద్ధిలో ఆమె పాత్ర నగరవాసుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోతుంది."
- డాక్టర్ మన్మోహన్ సింగ్, మాజీ ప్రధాని
"షీలాజీ మరణవార్త వినగానే దిగ్భ్రాంతికి గురయ్యా. నన్ను ఎంతో ప్రేమించేవారు. దిల్లీతో పాటు దేశానికి ఆమె చేసిన సేవ చిరస్మరణీయం. పార్టీలో గొప్ప నాయకురాలు. పార్టీకి, దేశ రాజకీయాల్లో షీలాజీ పాత్ర అనితర సాధ్యం."
- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
ఇదీ చూడండి: అనుకోకుండా వచ్చి ఉన్నత శిఖరాలకు చేరి..