దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ కన్నుమూశారు. దిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 81 ఏళ్ల షీలా దీక్షిత్... గతేడాది ఫ్రాన్స్‌లో హృదయ సంబంధిత శస్త్రచికిత్స చేయించుకున్నారు.
అనారోగ్య కారణాలతో కొన్ని రోజుల క్రితం దిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు షీలా. ఈ రోజు మధ్యాహ్నం 3.15 గంటలకు గుండె పోటు వచ్చింది. వెంటిలేటర్‌పై ఉంచి, వైద్యం అందించినా ఫలితం లేకపోయింది. 3.55 గంటలకు షీలా దీక్షిత్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.