తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈటీవీ భారత్​ కథనానికి స్పందన- ఎస్సీలకు న్యాయం - sc

తమిళనాడులో అంత్యక్రియల విషయంలోనూ ఎస్సీలపట్ల వివక్ష చూపిన ఘటనపై ఈటీవీ భారత్​ కథనానికి ప్రభుత్వం స్పందించింది. వెల్లూర్ జిల్లా నారాయణపురంలోని ఎస్సీల కోసం ప్రత్యేక శ్మశానవాటిక నిర్మాణానికి ఆదేశాలు ఇచ్చింది.

ఈటీవీ భారత్​ కథనానికి స్పందన- ఎస్సీలకు న్యాయం

By

Published : Aug 23, 2019, 7:55 PM IST

Updated : Sep 28, 2019, 12:47 AM IST

ఈటీవీ భారత్​ కథనానికి స్పందన- ఎస్సీలకు న్యాయం
తమిళనాడు వెల్లూర్​ జిల్లాలోని వానియంపాడి దగ్గర నారాయణపురంలో అగ్రకులాలవారు ఓ ఎస్సీ శవాన్ని తమ పొలాల మీదుగా తీసుకువెళ్లేందుకు వీల్లేదన్నారు. వారి పొలాలు దాటకుండా శ్మశానానికి వెళ్లేందుకు వేరే మార్గం లేదు. గత్యంతరం లేక మృతదేహాన్ని చాపలో చుట్టి, తాళ్ల సాయంతో 20 అడుగుల ఎత్తున్న వంతెనపై నుంచి కిందకు దింపారు. తర్వాత దహన సంస్కారాలు పూర్తి చేశారు.

'ఈటీవీ భారత్​ తమిళనాడు'లో ప్రసారమైన ఈ కథనానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనూహ్య స్పందన లభించింది. దళితులకు ప్రత్యేక శ్మశాన వాటిక నిర్మాణానికి కలెక్టర్​ ఉత్తర్వులు జారీ చేశారు.

Last Updated : Sep 28, 2019, 12:47 AM IST

ABOUT THE AUTHOR

...view details