తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మెడలోతు నీటిలో కన్నీళ్లు కలబోసి అంతిమయాత్ర!

భారీ వర్షాల కారణంగా ఆ గ్రామాన్ని వరద ముంచెత్తింది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఇలాంటి సమయంలో ఆ ఊరిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. చేసేదేమీ లేక మృతదేహాన్ని నాలుగడుగుల మేర ప్రవహిస్తున్న నీటిలోనే మోసుకెళ్లి అంత్యక్రియలు జరిపారు.

మెడలోతు నీటిలో కన్నీళ్లు కలబోసి అంతిమ యాత్ర!

By

Published : Oct 10, 2019, 1:43 PM IST

మెడలోతు నీటిలో కన్నీళ్లు కలబోసి అంతిమయాత్ర!
మధ్యప్రదేశ్​లోని కొన్ని ప్రాంతాల్లో వరద ఉద్ధృతి ఇంకా కొనసాగుతోంది.​ నీమచ్​ జిల్లా గిర్​దోరా పంచాయితీ​, పిపిలియా హాడా గ్రామంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. శ్మశానానికి వెళ్లే మార్గం చెరువును తలపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తి మృతిచెందాడు. గత్యంతరం లేక నాలుగడుగుల నీటిలోనే నడిచి అంతిమయాత్ర నిర్వహించారు బంధువులు. ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవట్లేదని స్థానికులు వాపోతున్నారు.
"ఒక్క గ్రామం కాదు జిల్లావ్యాప్తంగా చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి. గ్రామ పంచాయితీల్లో రోడ్లు లేకపోయినా, శ్మశాన వాటికకు వెళ్లే రోడ్లు, స్కూళ్లకు వెళ్లే మార్గం సరిగ్గా ఉండేలా చూడాలి. రతన్​గఢ్​లో గతేడాది ఓ మృతదేహాన్ని దహనం చేసేందుకు కట్టెలు దొరకకపోతే, శవాన్ని నీటిలో వదిలేశారు. గ్రామ పంచాయతీలు వీలైనంత త్వరగా ఈ సమస్యలను పరిష్కరించాలి."

- గ్రామస్థుడు.

ఈ విషయాన్ని ఆ జిల్లా కలెక్టర్​ అజయ్​ గంగావర్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన గ్రామ పంచాయితీ​ సీఈఓతో మాట్లాడి సమస్యను తీరుస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి:'చైనా కష్టాల్లో ఉంది.. దారికి వచ్చి తీరుతుంది'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details