తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బాధగా ఉన్నా నమ్మకంతో ముందుకు...' - patna sahib

భారతీయ జనతా పార్టీలో ఏకచ్ఛత్రాధిపత్యమే నడుస్తోందని, అందులో సమష్టి నిర్ణయాలకు తావులేదని ఆరోపించారు నటుడు, కాంగ్రెస్ నేత శతృఘ్న సిన్హా. కొంచెం బాధగా ఉన్నా.. ఇదే కారణంతో పార్టీని వీడానని ఈటీవీ భారత్ ముఖాముఖితో పంచుకున్నారు.

శతృఘ్న సిన్హా

By

Published : Apr 8, 2019, 7:02 AM IST

భాజపాలో వ్యక్తుల ప్రాబల్యం పెరిగిందని కాంగ్రెస్ నేత శతృఘ్న సిన్హా ఆరోపించారు. పార్టీలోని దిగ్గజ నేతలను పక్కబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని వీడటం బాధగా ఉన్నా భారత్​ను నిర్మించిన కాంగ్రెస్​లో చేరటం సంతోషంగా ఉందని ఈటీవీ భారత్​ ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు.

శతృఘ్న సిన్హాతో ఈటీవీ భారత్ ముఖాముఖి

ఏళ్లుగా భాజపాలో ఉండి.. కాంగ్రెస్​లో చేరారు. కారణాలేంటి?

భాజపా.. ప్రజాస్వామ్యాన్ని వదిలి వ్యక్తిస్వామ్యానికి వచ్చేసింది. సమష్టి చర్చలకు బదులుగా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఏకచ్ఛత్రాధిపత్యం-ఇద్దరు వ్యక్తల సైనిక వ్యవస్థ వచ్చేసింది పార్టీలోకి. గురువు, గొప్పనేత అడ్వాణీ, మురళీ మనోహర్ జోషీ, అరుణ్ శౌరీ, సుమిత్రా మహజన్​లకు ఏమైందో చూశాం. యశ్వంత్ సిన్హా బలవంతంగా బయటికి వెళ్లాల్సి వచ్చింది. ఎవరైతే మనల్ని నడిపించారో వాళ్లని పక్కనబెడుతున్నారు. దీన్ని మొఘల్ విధానమంటారు. నన్ను పొమ్మనలేకపోయారు... కానీ బెదిరింపులు మాత్రం వచ్చాయి. ఆవిర్భావ దినోత్సవ సమయంలో వెళ్లిపోవటం బాధగా ఉంది. నమ్మకంగా చెబుతున్నా.. గాంధీ, నెహ్రూ, ఇందిరా, మన్మోహన్ లాంటి గొప్ప వ్యక్తులు నడిపిన పార్టీలోకి వెళుతున్నా. కాంగ్రెస్​ పార్టీని బలోపేతం చేస్తూనే దేశ ప్రగతికి పాటుపడతాను.

ఇదీ చూడండి:భారత్​ భేరి: ఉపాధిపై రాజకీయ పకోడీలు

పట్నా సాహిబ్ నుంచి మిమ్మల్ని కాంగ్రెస్ నిలబెట్టింది. ఎప్పటిలాగే ఇక్కడి ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారా?

పట్నా ప్రజలపై నాకు నమ్మకముంది. గత ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచాను. మా కుటుంబ మిత్రుడు రవిశంకర్ ప్రసాద్​కు భాజపా టికెట్ ఇచ్చింది. ప్రజలు కూడా.. 'ఇప్పటికే ప్రసాద్​ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఏదైనా జరిగితే మళ్లీ అక్కడికే వెళతారు' అని అంటున్నారు. అయినా అది వాళ్ల పార్టీ అంతర్గత విషయం. మాకు చాలా పార్టీల మద్దతు ఉంది. మమతా బెనర్జీ, మాయావతి, అఖిలేశ్ యాదవ్, కేజ్రీవాల్, సంజయ్ సింగ్, మా కుటుంబ మిత్రుడు లాలూ ప్రసాద్ యాదవ్ మావైపే ఉన్నారు. పట్నా ప్రజల ఆశీర్వాదం ఉంది. 'బిహార్ బాబు'పై వాళ్ల ప్రేమ అపారం. ఈ విషయాన్ని వాళ్లకే వదిలేస్తున్నా. వాళ్లు ఏ తీర్పు ఇచ్చినా నాకు అంగీకారమే.

ఇదీ చూడండి:దేశానికి ప్రమాదమా? స్వేచ్ఛకు విఘాతమా??

రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవుతారా?

ఆయన ఎన్నో పనులు చేశారు. ఆయనలో ప్రజలు ప్రధాన మంత్రిని చూస్తున్నారు. చురుకైన నేత. వర్ధమాన భవిష్యత్తు నేతగా రాహుల్​నే భావిస్తున్నారు ప్రజలు. కర్ణాటక, తమిళనాడు, కేరళ మూడు రాష్ట్రాలను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి చర్యల వైపు భాజపా ఆలోచించలేదు. మనకు సంఖ్యాబలం ఉంటే ఎవరైనా ప్రధాని కావొచ్చు. పార్టీ ఆశీర్వాదం కావాలి. ప్రజల మద్దతు కావాలి అంతే.

ABOUT THE AUTHOR

...view details