తెలంగాణ

telangana

By

Published : Mar 14, 2019, 7:15 PM IST

ETV Bharat / bharat

"మోదీ...ఇక మీరు తప్పుకోండి"

ఇప్పటికైనా పదవి నుంచి తప్పుకొని, మంచి నాయకులకు అవకాశం ఇవ్వాలని ప్రధాని మోదీకి భాజపా మాజీ నేత శత్రుఘ్న సిన్హా సూచించారు. పదవీకాలంలో ఒక్కసారి కూడా మీడియాతో ప్రశ్నోత్తరాల సమావేశాన్ని నిర్వహించని ఏకైక ప్రధానిగా మోదీ చరిత్రకెక్కుతారని ఎద్దేవా చేశారు.

"మోదీ...ఇక మీరు తప్పుకోండి"

భాజపా మాజీ నేత శత్రుఘ్న సిన్హా ట్విట్టర్​ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఇప్పుడైనా ఒక్క మీడియా సమావేశాన్ని నిర్వహించండంటూ ఎద్దేవా చేశారు. పదవీకాలం పూర్తికావస్తున్న వేళ ఉత్తర్​ప్రదేశ్​లో 150 ప్రాజెక్టులను మోదీ ప్రకటించారంటూ ట్వీట్​ చేశారు.

"ఎన్నికల తేదీలు వచ్చేశాయి. కనీసం ఇప్పటికైనా ఒక్క మీడియా సమావేశాన్ని నిర్వహించండి సార్​! ముందుగా చిత్రీకరించకుండా, ఎటువంటి సన్నాహాలు లేకుండా మీడియా సమావేశం నిర్వహించాలి. తన పూర్తి పదవీకాలంలో మీడియాతో ఒక్క ప్రశ్నోత్తరాల సమావేశాన్నీ నిర్వహించని ఏకైక ప్రధానిగా మీరు చరిత్రకెక్కుతారు. ప్రభుత్వం మారేలోపు నూతన, మంచి నాయకత్వ లక్షణాలున్న వారికి బాధ్యతలు అప్పగించడానికి ఇదే సరైన సమయమని మీకు అనిపించట్లేదా? ఇప్పటికైనా మీ నిజస్వరూపాన్ని బయటపెట్టండి"
-- శత్రుఘ్న సిన్హా, భాజపా మాజీ నేత

1990 నుంచి భాజపాలో ఉన్నారు శత్రుఘ్న సిన్హా. వాజ్​పేయీ పాలనలో కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. ప్రస్తుతం పట్నా సహేబ్​ నుంచి ఎంపీగారెండోసారిసేవలందిస్తున్నారు.

కొన్ని నెలల క్రితం భాజపాను వీడిన శత్రుఘ్న... మార్చి​ 22లోపు తన తదుపరి కార్యాచరణను వెల్లడిస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్​ లేదా ఆర్​జేడీ పార్టీలో శత్రుఘ్న చేరే అవకాశాలున్నాయి.

ABOUT THE AUTHOR

...view details