తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భాజపా... ఇద్దరు వ్యక్తుల సైన్యం' - congress

భాజపా మాజీ నేత, ఎంపీ శత్రుఘ్న సిన్హా కాంగ్రెస్​లో చేరారు. పార్టీ​ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, అధికార ప్రతినిధి రణ్​దీప్ సుర్జేవాలా సమక్షంలో దిల్లీలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. భాజపాపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్​లో చేరిన శత్రుఘ్న

By

Published : Apr 6, 2019, 4:01 PM IST

Updated : Apr 6, 2019, 8:49 PM IST

'భాజపా... ఇద్దరు వ్యక్తుల సైన్యం'

భాజపా ప్రస్తుతం "ఏక వ్యక్తిస్వామ్యం- ఇద్దరు వ్యక్తుల సైన్యం" అన్నట్లు తయారైందని ఆ పార్టీ మాజీ నేత, సినీ నటుడు శత్రుఘ్న సిన్హా విమర్శించారు. భాజపాలో సొంత పార్టీ వ్యక్తులకు గౌరవం లేని పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.

ఇటీవలే కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీతో సమావేశమైన శత్రుఘ్న సిన్హా... నేడు ఆ పార్టీలో చేరారు. దిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​, అధికార ప్రతినిధి రణ్​దీప్ సుర్జేవాలా సమక్షంలో కండువా కప్పుకున్నారు.

"భాజపాలో ప్రజాస్వామ్యం క్రమక్రమంగా నియంతృత్వంలా తయారైంది. నేను చాలాసార్లు చెప్పా. అక్కడ ఏక వ్యక్తిస్వామ్యం, ఇద్దరు వ్యక్తులదే ఆధిపత్యం. సమష్టిగా నిర్ణయాలు తీసుకునే పద్ధతి అంతరించింది. భాజపాకు మార్గనిర్దేశకులైన దిగ్గజ నేతలను మార్గదర్శక్​ మండల్​లో చేర్చారు. ఇప్పటివరకు ఒక్క సమావేశం నిర్వహించలేదు."
-శత్రుఘ్న సిన్హా, కాంగ్రెస్​ నేత

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ దృఢమైన యువనేత, భవిష్యత్​ నాయకుడని సిన్హా కితాబిచ్చారు.

సహచరుడిపైనే పోటీ...

పార్టీలో చేరిన కాసేపటికే శత్రుఘ్న సిన్హాకు లోక్​సభ ఎన్నికల టికెట్​ ఇచ్చింది కాంగ్రెస్​. బిహార్​లోని పట్నా సాహిబ్​ స్థానం నుంచి బరిలోకి దింపింది. కేంద్ర మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ ఆ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి.

ఇదీ చూడండి : "ఎన్నికల వేళ అబద్ధాల వర్షం కురుస్తోంది"

Last Updated : Apr 6, 2019, 8:49 PM IST

ABOUT THE AUTHOR

...view details