2019 ఏడాదికిగానూ కేంద్ర సాహిత్య పురస్కారాల విజేతలను ప్రకటించింది 'ది నేషనల్ అకాడెమీ ఆఫ్ లెటర్స్'. మొత్తం 23 మంది ఈ అవార్డును అందుకోనున్నారు. వీరిలో కాంగ్రెస్ సీనియర్ నేత, పార్లమెంట్ సభ్యుడు శశి థరూర్‌తో పాటు నంద కిశోర్ ఆచార్య ఉన్నారు.
నాన్ ఫిక్షనల్ విభాగంలో థరూర్ ఆంగ్ల రచన 'యాన్ ఎరా ఆఫ్ డార్క్‌నెస్' పుస్తకానికిగానూ ఈ అవార్డు దక్కింది. భారత్‌పై బ్రిటిష్ పాలకుల ప్రభావం గురించి తెలియజేస్తూ థరూర్ ఈ పుస్తకం రాశారు. థరూర్‌తో పాటు మొత్తం 23 మంది ఈ అవార్డు అందుకోనున్నారు. హిందీ నవల 'చీలేతే హో ఆప్నే కో'కుగానూ కిశోర్ ఆచార్యకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు