జామియా అల్లర్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేఎన్‌యూ మాజీ విద్యార్థి షార్జీల్ ఇమామ్‌పై దిల్లీ కోర్టులో అదనపు అభియోగ పత్రం దాఖలు చేశారు పోలీసులు. ప్రజలను రెచ్చగొట్టేలా అతను చేసిన ప్రసంగాలు అల్లర్లకు దారి తీశాయని ఆరోపించారు. ఈ మేరకు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశాడని పేర్కొంటూ ఛార్జిషీట్లో షార్జీల్‌పై సెక్షన్ 124ఏ (దేశద్రోహం), 153ఏ(రెండు వర్గాల మధ్య గొడవకు ప్రేరేపించడం) కింద అభియోగాలు మోపారు దిల్లీ పోలీసులు.
సీఏఏకు వ్యతిరేకంగా డిసెంబర్ 15న జామియా విద్యార్థులు చేపట్టిన నిరసన ర్యాలీ హింసాయుతమైంది. ఈ అల్లర్లలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.