లోక్తాంత్రిక్ జనతాదళ్(ఎల్జేడీ) చీఫ్ కుమార్తే శుభాషిణి.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల దగ్గరపడుతున్న నేపథ్యంలో మహాకూటమికి మద్దతు తెలుపుతున్నట్లు ఆమె ప్రకటించారు. కాంగ్రెస్ బిహార్ నాయకులు శుభాషిణికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
" నాకు ఈ అవకాశం కల్పించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలకు కృతజ్ఞతలు. మా నాన్న అనారోగ్యం కారణంగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో క్రియాశీలకంగా లేరు. ఆయన మద్దతు మాత్రం ఎప్పుడూ మహాకూటమికే. ఎన్నికల్లో విజయం కోసం నా వంతు కృషి చేస్తా. "