తెలంగాణ

telangana

By

Published : Nov 24, 2019, 6:26 AM IST

Updated : Nov 24, 2019, 7:15 AM IST

ETV Bharat / bharat

'పవార్​ ఎన్​డీఏలో చేరాలి.. అజిత్​కు మద్దతివ్వాలి'

మహారాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో శరద్​ పవార్​ ఎన్​డీఏలో చేరడంపై అలోచించాలన్నారు కేంద్రమంత్రి రామ్​దాస్​ అఠవాలే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో భాజపాకు సహాయపడిన అజిత్​ పవార్​కు ఎన్​సీపీ అధ్యక్షుడు మద్దతివ్వాలని సూచించారు.

'పవార్​ ఎన్​డీఏలో చేరాలి.. అజిత్​కు మద్దతివ్వాలి'

ఎన్​సీపీ అధినేత శరద్​పవార్​ ఎన్​డీఏలో చేరాలని అభ్యర్థించారు కేంద్రమంత్రి రామ్​దాస్​ అఠవాలే. అదే జరిగితే పవార్​కు కేంద్రంలో మంత్రి పదవి దక్కుతుందని సంకేతాలిచ్చారు.

మహారాష్ట్రలో నెలకొన్న పరిస్థితులకు కారణం శివసేననే అని ఆరోపించిన అఠవాలే.. తన సోదరుడి కొడుకు అజిత్​ పవార్​కు శరద్​ పవార్​ మద్దతివ్వాలని అభిప్రాయపడ్డారు.

"కాంగ్రెస్​ను భాజపా ఇరకాటంలోకి నెట్టింది. శివసేనకు షాక్​ ఇచ్చింది. ఎన్​సీపీని తనతో పాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తీసుకెళ్లింది. పవార్​ ఎన్​డీఏలో చేరడంపై అలోచించాలి. ఆయనకు మంచి పోర్ట్​ఫోలియోలు అందుతాయి."
--- రామ్​దాస్​ అఠవాలే, కేంద్రమంత్రి.

ప్రభుత్వస్థాపనకు కాంగ్రెస్​-ఎన్​సీపీ-శివసేన సన్నద్ధమవుతున్న తరుణంలో.. మహా ప్రతిష్టంభనకు ముగింపు పలుకుతూ భాజపా నేత దేవంద్ర పఢణవీస్​ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఎన్​సీపీ ముఖ్య నేత అజిత్​ పవార్​ డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టారు.

ఇదీ చూడండి:-ఆ రంగంలో 'అమిత్​ షా'నే బెస్ట్​ ఫినిషర్​..!

Last Updated : Nov 24, 2019, 7:15 AM IST

ABOUT THE AUTHOR

...view details