కేంద్ర విజిలెన్స్ (సీవీసీ) తాత్కాలిక కమిషనర్‌గా శరద్‌కుమార్ నియమితులయ్యారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కమిటీ నూతన సీవీసీని నియమించే వరకు ఆయన పదవిలో కొనసాగనున్నారు. కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరీ, విజిలెన్స్ కమిషనర్ టీఎం భాసిన్ పదవీ కాలం ముగిసినందున... వారి తర్వాతి స్థానంలో ఉన్న శరద్‌కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు. ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత సమావేశమై నూతన సీవీసీ కమిషనర్‌ను ఎంపిక చేయనున్నారు.
కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చీఫ్‌గా వ్యవహరించిన శరద్‌కుమార్... గత ఏడాది జూన్ 12న విజిలెన్స్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. వచ్చే ఏడాది అక్టోబర్‌లో ఆయన పదవీకాలం ముగియనుంది.