బంగాల్లో నిర్ణీత సమయానికి ఒక రోజు ముందుగానే ప్రచారం ముగించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. ఈసీ తన విలువను కోల్పోతోందని ఆరోపించింది.
ఆర్టికల్ 324ను ఉపయోగించి రాజ్యాంగానికి ఈసీద్రోహం చేసిందని విమర్శించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా. ఎన్నికల సంఘం తన స్థాయిని నిలబెట్టుకోలేకపోయిందని ఆరోపించారు. ఈసీ నిర్ణయం వల్ల ప్రజాస్వామ్యంలో చీకటి రోజు ఏర్పడిందన్నారు సుర్జేవాలా.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షాలపై 11 ఫిర్యాదులు చేస్తే ఇప్పటి వరకు ఈసీ ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. బంగాల్లో హింసకు కారణమైన భాజపాపై చర్యలు చేపట్టడంలో ఎన్నికల సంఘం విఫలమైందన్నారు. మోదీ ర్యాలీకి అనుమతించి, ఇతరులపై నిషేధం విధించటమేంటని ప్రశ్నించారు.