ఎన్నికల వేళ.. ఒకవైపు బాధ్యతగా ఓటేసి.. మరోవైపు సీఏఏ ఆందోళనలను సజీవంగా ఉంచేందుకు ప్రయత్నించారు షహీన్‌బాగ్ నిరసనకారులు. పోలింగ్ రోజు వేదిక కాస్త ఖాళీగా కనిపిస్తాయనుకున్నారు అందరూ. కానీ, అలా జరగలేదు. ఎప్పటిలాగే ఆందోళన కొనసాగింది. అందరూ ఒకే సారి వెళ్లకుండా బృందాలుగా విడిపోయి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒక బృందం పోలింగ్ బూత్‌కు వెళ్లినప్పుడు ఇతర బృందాల్లోని మహిళలు నిరసనను కొనసాగించారు.
"ఇక్కడున్న మహిళలంతా బృందాలుగా వెళ్లి ఓటు వేయాలని ఒక రోజు ముందే నిర్ణయించుకున్నాం. ఉదయం కొందరు ఓటు వేయడానికి వెళ్లినప్పుడు... కొంతమంది ఇక్కడే ఉండిపోయారు. వారు ఓటు వేసి తిరిగి వచ్చాక మధ్యాహ్నం కొంతమంది ఓటుహక్కును వినియోగించుకుని వచ్చారు."
-జహీదా ఖాన్, ఆందోళనకారిని