దిల్లీ షహీన్‌బాగ్ నిరసనకారుడు, సామాజిక కార్యకర్త షహ్జాద్ అలీ భాజపాలో చేరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా, మరో నేత శ్యాం జాజు సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. అలీకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆదేశ్.
అలీకి స్వీట్ తినిపిస్తోన్న అదేశ్ గుప్తా 'భాజపాను శత్రువుగా భావిస్తున్న మా వర్గం వారి ఆలోచన తప్పు అని నిరూపించేందుకు నేను భాజపాలో చేరాను. సీఏఏ ఆందోళనలపై వారితో కలిసి చర్చిస్తాం' అని చెప్పారు అలీ.
మోదీ ప్రభుత్వం పౌరసత్వ చట్టాన్ని సవరించడానికి వ్యతిరేకంగా దిల్లీలోని షహీన్‌బాగ్‌లో 2019 డిసెంబర్ 14 నుంచి 2020 మార్చి 24 వరకు తీవ్ర నిరసనలు జరిగాయి. ఆ ప్రాంతంలోకి మరెవ్వరూ అడుగుపెట్టకుండా రహదారులన్నింటినీ పూర్తిగా దిగ్బంధించి... మహిళలు, చిన్నారులు సైతం పాల్గొన్న ఆ నిరసనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఆ ఆందోళనల్లో పాల్గొన్న వ్యక్తి ఇప్పుడు భాజపాలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది.
పార్టీ కండువా కప్పుతోన్న భాజపా రాష్ట్ర్ర అధ్యక్షుడు ఇదీ చూడండి: విడాకుల్లో ఒకే విధానం కోరుతూ సుప్రీంలో వ్యాజ్యం