ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ 'ప్రపంచంలోని 100 మంది ప్రభావశీలుర జాబితా'లో చోటుదక్కడంపై షాహీన్‌బాగ్ నిరసనకారిణి బిల్కిస్ దాదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈటీవీ భారత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన 82 ఏళ్ల ఉద్యమకారిణి.. ప్రస్తుతం కరోనా మహమ్మారి వ్యతిరేక పోరుపై దృష్టి సారించాల్సిన సమయమని అన్నారు.
బిల్కిస్ దాదీతో ముఖాముఖి షాహీన్‌బాగ్ నిరసనలతో..
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గతేడాది దిల్లీలో జరిగిన షాహీన్‌బాగ్ నిరసనల నేపథ్యంలో బిల్కిస్ వెలుగులోకి వచ్చారు. హాపుర్కు చెందిన బిల్కిస్.. తన కుమారులతో షాహీన్‌బాగ్‌లో నివసిస్తున్నారు. ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురు-2020 జాబితాలో ఒకరిగా ఆమెను గుర్తించింది టైమ్ మ్యాగజైన్.
ఈ జాబితాలో చోటు సంపాదించిన ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు బిల్కిస్. ఆయన పేరును చేర్చినందుకు టైమ్ సంస్థకూ కృతజ్ఞత తెలిపారు. మోదీ తనకు కొడుకు లాంటి వారని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:అంబులెన్స్‌లో కరోనా రోగి- వైన్ షాప్‌లో సిబ్బంది