తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కాంగ్రెస్​కు భారతీయత తెలియదు- వారిది ఇటలీ సంస్కృతి'

కేంద్ర మంత్రి అమిత్​ షా మరోసారి కాంగ్రెస్​పై మాటల తూటాలు పేల్చారు. రఫేల్​ ఆయుధ పూజను విమర్శించడం తగదని హితవు పలికారు. భారతీయ సంస్కృతిని తెలుసుకోవాలని విపక్ష నేతలకు సూచించారు.

By

Published : Oct 9, 2019, 6:53 PM IST

కాంగ్రెస్​కు భారత సంస్కృతి తెలీదు.. ఇటలీ సంస్కృతి తెలుసు : అమిత్​ షా

'కాంగ్రెస్​కు భారతీయత తెలియదు- వారిది ఇటలీ సంస్కృతి'
రఫేల్​ యుద్ధవిమానానికి రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ ఫ్రాన్స్​లో ఆయుధ పూజ నిర్వహించడంపై కాంగ్రెస్​ విమర్శలను తిప్పికొట్టారు భాజపా అధ్యక్షుడు అమిత్ షా. కాంగ్రెస్​ నాయకులకు భారతీయ సంస్కృతి కన్నా ఇటలీ సంప్రదాయాలే ఎక్కువగా తెలుస్తాయని ఎద్దేవా చేశారు.

ఈనెల 21న శాసనసభ ఎన్నికలు జరిగే హరియాణాలోని కైతల్​లో ప్రచార సభలో పాల్గొన్నారు షా. రఫేల్​, ఆర్టికల్​ 370 రద్దుపై కాంగ్రెస్​ నేతల తీరును తీవ్రంగా తప్పుబట్టారు.

" విజయదశమి రోజున మన దేశ రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ రఫేల్​ యుద్ధ విమానాన్ని భారత వాయుసేనలో చేర్చి దేశాన్ని మరింత శక్తిమంతం చేశారు. రఫేల్​ పేరెత్తగానే రాహుల్​ గాంధీకి కడుపులో నొప్పి పుడుతుంది. ఈ దేశ సైన్యానికి బలం ఎందుకు చేకూరాలని ఆయనకు అనిపిస్తుంది. అలాంటి రఫేల్​కు ఆయుధ పూజ చేసి తమాషా చేయడం ఎందుకని అడిగారు. మీరు చెప్పండి, అసురులపై విజయం సాధించడానికి ఆయుధ పూజ చేయాలా వద్దా? ఇది మన దేశ సంస్కృతి. అవునా, కాదా? కాంగ్రెస్ అధికరణం 370 రద్దును అడ్డుకుంది. కానీ, భాజపా ఆ ఆర్టికల్​ను రద్దు చేసేసింది."
-అమిత్​ షా, భాజపా అధ్యక్షుడు

దేశవ్యాప్తంగా ఎన్​ఆర్​సీ అమలు చేసి, వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి అక్రమ వలసదారులు అందరినీ వెళ్లగొడతామని స్పష్టంచేశారు షా.

ఇదీ చూడండి:ఉన్నవి 90 సీట్లు.. బరిలో 1,168 మంది అభ్యర్థులు!

ABOUT THE AUTHOR

...view details