తెలంగాణ

telangana

ETV Bharat / bharat

370 రద్దు భారత్​కు అతిపెద్ద విజయం: అమిత్ షా

జమ్ము కశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు భారత్​కు అతిపెద్ద మైలురాయి అని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా ఉద్ఘాటించారు. త్రివిధ దళాలకు ఉమ్మడి సారథి ప్రకటనను స్వాగతించారు. హరియాణాలో ఎన్నికల ప్రచారంలో జింద్​ బహిరంగ సభలో పాల్గొన్నారు అమిత్​ షా.

అమిత్ షా

By

Published : Aug 16, 2019, 5:15 PM IST

Updated : Sep 27, 2019, 5:03 AM IST

అమిత్ షా

అధికరణ 370 రద్దు అతిపెద్ద విజయమని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా ఉద్ఘాటించారు. ఈ చర్యతో జమ్ము కశ్మీర్​లో ఉగ్రవాదం నశించి అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ​ కశ్మీర్​ విషయంలో కాంగ్రెస్ అలసత్వం ప్రదర్శించిందని విమర్శించారు.

హరియాణాలో రెండు నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా జింద్​లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు అమిత్​ షా.

"70 ఏళ్ల పాటు ఓటుబ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ ప్రయత్నించింది. కానీ 75 రోజుల్లో మోదీ ప్రభుత్వం 370, 35ఏ రద్దు చేసి చూపించింది. ఈ చర్య భారత సమగ్రత, ఐక్యత దిశగా అతిపెద్ద మైలురాయిగా నిలుస్తుంది. జమ్ము, కశ్మీర్​, లేహ్​, లద్దాఖ్​ అభివృద్ధి వైపు పరుగులు పెడుతాయి. ఉగ్రవాదం నశిస్తుంది."

-అమిత్​ షా, కేంద్ర హోం మంత్రి

సీడీఎస్​ ప్రకటనపై హర్షం

త్రివిధ దళాలకు ఉమ్మడి సారథి 'సీడీఎస్'​ ప్రకటనపై అమిత్​ షా హర్షం వ్యక్తం చేశారు. కార్గిల్​ యుద్ధం సమయంలోనూ ఈ అంశంపై విస్తృతంగా చర్చలు జరిగాయని గుర్తు చేశారు. త్రివిధ దళాలు, ప్రభుత్వం మధ్య సమన్వయం పెరుగుతుందన్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా హరియాణా ముఖ్యమంత్రి మనోహర్​ లాల్​ ఖట్టర్​పై ప్రశంసలు కురిపించారు షా. రాష్ట్రంలో అవినీతిని నిర్మూలించారని, ప్రభుత్వ ఉద్యోగాల నియామకంలో పారదర్శకత పాటించారని కొనియాడారు.

ఇదీ చూడండి: కశ్మీర్​లో తెరుచుకున్న ప్రభుత్వ కార్యాలయాలు

Last Updated : Sep 27, 2019, 5:03 AM IST

ABOUT THE AUTHOR

...view details