పెద్దల సభకు వెళ్లే అవకాశం ఎవరికో...? రాజ్యసభ సభ్యత్వానికి భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, స్మృతి ఇరానీ, డీఎంకే నాయకురాలు కనిమొళి రాజీనామా చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పార్లమెంటు ఎగువసభ సచివాలయం పేర్కొంది.
గుజరాత్ గాంధీనగర్ నుంచి అమిత్ షా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీ నుంచి స్మృతి ఇరానీ, బిహార్ పట్నా నుంచి రవిశంకర్ ప్రసాద్‌లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. తమిళనాడు తూతుక్కుడి నుంచి కనిమొళి విజయం సాధించారు.
ఆ స్థానాల్లోకి ఎవరు...?
ఎన్డీఏ భాగస్వామ్యపక్షం ఎల్జేపీ అధినేత రామ్ విలాస్ పాసవాన్‌కు కొత్త ప్రభుత్వంలో మంత్రి పదవి ఇవ్వాలని భావిస్తోంది. కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ స్థానంలో పాసవాన్‌ను రాజ్యసభకు పంపాలని యోచిస్తోంది భాజపా.
గుజరాత్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన అమిత్ షా, స్మృతి ఇరానీ లోక్‌సభకు ఎన్నికవటం వల్ల ఆ రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైనవారితో ఆ రెండు స్థానాలను భర్తీ చేయాలని చూస్తోంది భాజపా.
ఇదీ చూడండి:పాంచ్ పటాకా సీఎం 'నవీన్ పట్నాయక్'