భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పార్టీ సీనియర్ నేతలు ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషీలతో భేటీ అయ్యారు.
వారివారి నివాసాలకు వెళ్లి సమావేశమయ్యారు షా. ఎన్నో ఏళ్లుగా సీనియర్ నేత ఎల్.కే అడ్వాణీ ప్రాతినిధ్యం వహిస్తోన్నగుజరాత్లోని గాంధీనగర్ లోక్ సభ స్థానం నుంచి ఈ సారి అమిత్ షా బరిలో నిలిచారు. అందుకే ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారని పార్టీ వర్గాల సమాచారం.