దిల్లీలో కరోనా నియంత్రణ చర్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌తో మరోసారి భేటీ అయ్యారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌తో పాటు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు కూడా ఈ సమవేశంలో పాల్గొన్నారు. దేశ రాజధానిలో కరోనా నియంత్రణ చర్యలపై అధికారులతో కలిసి ఇవాళ రెండోసారి సమీక్షిస్తున్నారు షా.
రెండో రౌండ్: దిల్లీ సీఎం, ఎల్జీతో షా భేటీ - Shah meeting with Kejriwal latest news
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌తో మరోసారి భేటీ అయ్యారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. దేశ రాజధానిలో కరోనా నియంత్రణ చర్యలపై ఉదయమే సమీక్షించగా మరోమారు అధికారులతో కలిసి సమావేశమయ్యారు.
![రెండో రౌండ్: దిల్లీ సీఎం, ఎల్జీతో షా భేటీ Shah meeting with Delhi CM and Lieutenant Governor again](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7608103-135-7608103-1592136632533.jpg)
దిల్లీ సీఎం, లెఫ్ట్‌నెంట్ గవర్నర్లతో షా రెండోసారి భేటీ
దిల్లీలో కరోనా కేసుల కట్టడికి తీసుకున్న చర్యలపై కేజ్రీవాల్, అనిల్ బైజల్‌తో ఈ ఉదయమే చర్చించారు కేంద్ర హోంమంత్రి. అనంతరం అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్‌లో విధులు నిర్వర్తిస్తున్న నలుగురు ఐఏఎస్ అధికారులను తక్షణమే దిల్లీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు.
Last Updated : Jun 14, 2020, 6:06 PM IST
TAGGED:
దిల్లీ ముఖ్యమంత్రితో షా భేటీ