కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై భాజపా అధ్యక్షుడు అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు. సోమవారం బెంగళూరులో జరిగిన కాంగ్రెస్ సభలో మోదీకి అనుకూలంగా నినాదాలు చేసిన యువకుల అరెస్ట్‌పై షా ఘాటుగా స్పందించారు. యువకులను బెదిరించడం ఆపాలని సూచించారు. అది కాంగ్రెస్ రాజకీయ విలువలను తగ్గిస్తుందని రాహుల్‌కు చెప్పారు. యువతే భవిష్యత్తు నిర్ధేశకులని పేర్కొన్నారు.
"జేఎన్‌యూలో దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని మీరు కౌగిలించుకుంటారు. కానీ మోదీకి అనుకూలంగా నినాదాలు చేసిన యువకులను అరెస్ట్ చేస్తారా? స్వతంత్రంగా మాట్లాడేవారెక్కడున్నారు? అక్కడ యువకులు చేసిందేమిటో కాంగ్రెస్ రాకుమారుడు తెలుసుకోవాలి. భారతదేశ యువతను భయపెట్టడం ఆపాలి. అది మీ రాజకీయ విలువలను తగ్గిస్తుంది" - అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు.