"నేను కాంగ్రెస్ పార్టీని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. మీరు చెప్పిన దాని ప్రకారం.. దేశ ప్రజలను భయాందోళనలకు గురిచేసిన దాడులను సాధారణ ఘటనగా భావిస్తున్నారా? మీ పార్టీ నేత కొంత మంది చేసిన పనికి దేశం(పాకిస్థాన్) మొత్తం మీద పడాల్సిన అవసరం లేదంటున్నారు. కాంగ్రెస్ దీన్ని అంగీకరిస్తుందా? దేశంలో జరిగే ఉగ్రదాడులకు పాకిస్థాన్‌కు, దాని సైన్యానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పగలదా? ఉగ్రదాడులకు మెరుపుదాడులతో బదులివ్వకూడదని కాంగ్రెస్ చెబుతోంది. చర్చలతోనే పరిష్కరించాలంటోంది. కాంగ్రెస్ చెబుతున్నది సాధ్యమయ్యే చర్యేనా? ఈ మూడు ప్రశ్నలపై ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సమాధానం చెప్పాలి. "
-అమిత్ షా, భాజపా జాతీయాధ్యక్షుడు
జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ భారత వాయుసేనపై అనుమానాలు వ్యక్తం చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు అమిత్ షా. ఓ విశ్వవిద్యాలయంలో దేశ వ్యతిరేక నినాదాలు చేస్తున్న వారికి మద్దతు పలికి మీరేంటో తెలియజెప్పారని విమర్శించారు.