పంజాబ్‌లోని అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో టిక్‌టాక్ వీడియోల చిత్రీకరణను నిషేధించారు. ఆలయ పవిత్రతకు భంగం కలుగుతుందనే నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ నిర్వహణను పర్యవేక్షించే శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ తెలిపింది. ఇటీవలే గుడిలో నృత్యాలు చేస్తూ, పాటలు పాడుతున్న భక్తుల టిక్‌టాక్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా స్వర్ణ దేవాలయంలో ఇకపై ఈ చిత్రీకరణలను నిషేధిస్తూ గోడ పత్రికలను కూడా అంటించింది.
స్వర్ణదేవాలయంలో ఇకపై 'టిక్‌టాక్' నిషేధం - punjab news
ఆలయ పవిత్రతకు భంగం వాటిల్లుతుందనే కారణంతో పంజాబ్‌లోని ప్రసిద్ధ అమృత్సర్ స్వర్ణదేవాలయంలో టిక్‌టాక్ వీడియోల చిత్రీకరణను నిషేధించారు. ఇటీవలే గుడిలో నృత్యాలు చేస్తూ, పాటలు పాడుతున్న భక్తుల టిక్ టాక్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది ఆలయ కమిటీ.
![స్వర్ణదేవాలయంలో ఇకపై 'టిక్‌టాక్' నిషేధం SGPC bans making TikTok videos inside Amritsar's Golden Temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6011815-4-6011815-1581232478919.jpg)
స్వర్ణదేవాలయంలో ఇకపై టిక్‌టాక్ నిషేధం
స్వర్ణదేవాలయంలో ఇకపై 'టిక్‌టాక్' నిషేధం
ఆలయంలో ఇప్పటికే ఫోటోలు, వీడియోలు తీయడంపై నిషేధం ఉండగా.. భవిష్యత్తులో మొబైల్ ఫోన్లు తీసుకురావడంపైనా ఆంక్షలు విధిస్తామని ప్రబంధక్ కమిటీ వెల్లడించింది.
Last Updated : Feb 29, 2020, 5:58 PM IST