తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ అగ్నిప్రమాదం: భవన యజమాని అరెస్టు.. కేసు నమోదు - undefined

factory
భారీ అగ్ని ప్రమాదం

By

Published : Dec 8, 2019, 9:35 AM IST

Updated : Dec 8, 2019, 6:45 PM IST

18:40 December 08

దిల్లీ అగ్నిప్రమాదం జరిగిన భవన యజమాని అరెస్టు

దిల్లీ అనాజ్‌మండీ అగ్నిప్రమాదం జరిగిన పరిశ్రమ భవనం యజమాని, అతని మేనేజర్​ను పోలీసులు అరెస్టు చేశారు. యజమాని రేహాన్​పై ఐపీసీ 304 కింద కేసు నమోదు చేశారు. ఇవాళ ఉదయం పరిశ్రమలో మంటలు ఎగిసిపడి ఇప్పటివరకు 43 మంది ప్రాణాలు కోల్పోయారు. 

11:50 December 08

దర్యాప్తునకు కేజ్రీ ఆదేశం-పరిహారంపై ప్రకటన

అనాజ్​మండీ అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారాన్ని అందిస్తామని వెల్లడించారు. అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు భాజపా కూడా పరిహారాన్ని ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేలు అందిస్తామని వెల్లడించింది.

11:23 December 08

కేజ్రీవాల్ సందర్శన

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాణి ఝాన్సీరోడ్​లోని అనాజ్​ మండీ వద్ద ఉన్న అగ్నిప్రమాద స్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఘటనకు గల కారణాలను తెలుసుకున్నారు. ఘటనకు కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

11:12 December 08

వారంలో నివేదిక ఇవ్వాలి: దిల్లీ ప్రభుత్వం

అనాజ్​ మండీ వద్ద జరిగిన ప్రమాదంపై దిల్లీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఏడు రోజుల్లో నివేదిక అందజేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేసింది. ఈ మేరకు దిల్లీ రెవెన్యూ మంత్రి కైలాశ్ గహ్లోత్ ప్రకటన విడుదల చేశారు.

10:57 December 08

రాష్ట్రపతి విచారం

దిల్లీ రాణి ఝాన్సీరోడ్​లో జరిగిన అగ్నిప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేశారు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆయన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

10:44 December 08

ఘటనా స్థలికి ఎన్​డీఆర్ఎఫ్​

అగ్ని ప్రమాద స్థలానికి ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు చేరుకున్నాయి. సహాయక చర్యలను సమీక్షించి చేపట్టాల్సిన తదుపరి కార్యాచరణపై రంగంలోకి దిగాయి. ఇప్పటివరకు 43మంది మృతి చెందగా 59మంది సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

10:38 December 08

అగ్ని ప్రమాదవార్త కలచివేసింది: రాహుల్

దిల్లీ అగ్ని ప్రమాదం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఘటనలో పదుల సంఖ్యలో మృతి చెందారన్న వార్త కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలిపారు రాహుల్. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

10:19 December 08

భయంకర దుర్ఘటన: మోదీ

అగ్నిప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. భయంకర ఘటనగా అభివర్ణించారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

10:13 December 08

43కు చేరిన మృతుల సంఖ్య

అగ్ని ప్రమాద మృతుల సంఖ్య 43కు చేరింది. భవనం లోపల మరింతమంది ఉండేందుకు అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

10:08 December 08

కేజ్రీవాల్ విచారం

రాణి ఝాన్సీరోడ్​ అగ్ని ప్రమాద ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వ్యాఖ్యానించారు. గాయపడినవారిని ఆసుపత్రులకు తరలించినట్లు వెల్లడించారు.

10:03 December 08

'దట్టమైన పొగవల్లే'

దట్టమైన పొగ వల్లే భారీగా మృతుల సంఖ్య భారీగా పెరిగిందని అగ్నిమాపక దళ సిబ్బంది వ్యాఖ్యానించారు. భవనం లోపల ఇంకా పలువురు  ఉండే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

09:59 December 08

అమిత్​షా దిగ్భ్రాంతి

దిల్లీ అగ్ని ప్రమాదం పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్​షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైన  సహాయక చర్యలను సత్వరం అందించాలని అధికారులను ఆదేశించారు.

09:53 December 08

ప్రమాద దృశ్యాలు

గాయపడిన వారిని ఆసుపత్రికి తరలింపు

గాయపడిన వారు ఆర్​ఎంఎల్, లోక్‌నాయక్, హిందురావు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం స్థానికంగా ఉన్న ఓ ఫ్యాక్టరీలో జరిగిందని సమాచారం. కూలీలంతా నిద్రలో ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. అందువల్లే మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

09:38 December 08

35కు చేరిన మృతుల సంఖ్య

దిల్లీ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 35కు చేరింది. నేటి తెల్లవారుజామున జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు 50మందిని రక్షించగా ఇంకా అనేకమంది భవనంలోనే ఉన్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. 

09:21 December 08

ఘోర ప్రమాదం...

దిల్లీ అనాజ్​మండిలోని రాణి ఝాన్సీరోడ్‌లో ఓ బహుళ అంతస్థుల భవనంలో ఈ తెల్లవారుజాము భారీ అగ్నిప్రమాదం జరిగింది. 32 మంది ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఇప్పటివరకు 50మంది ప్రాణాలతో బయటపడ్డారు. 30 అగ్నిమాపక శకటాలతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు.

Last Updated : Dec 8, 2019, 6:45 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details