మోదీ జీ అలా చేయొద్దు- ట్రెండింగ్లో '#నో సర్' సామాజిక మాధ్యమాలను వీడే యోచనలో ఉన్నట్లు మోదీ నిన్న ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే '#నో సర్' ట్రెండింగ్లోకి వచ్చింది. సోషల్ మీడియాను వీడొద్దంటూ ప్రధాని మోదీకి విజ్ఞప్తులు వెల్లువెత్తాయి.
అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టేస్తూ సోమవారం సంచలన విషయాన్ని వెల్లడించారు మోదీ. సామాజిక మీడియాను వీడే యోచనలో ఉన్నట్లు తెలిపారు.
"ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ల్లోని నా ఖాతాలను విడిచిపెట్టాలని భావిస్తున్నాను" అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
మంగళవారం ఉదయానికి ఈ ట్వీట్ 38,900 సార్లు రీట్వీట్ అయింది. కనీసం నిమిషానికి ఒకరు కామెంట్ పెడుతున్నారు.
చాలా మంది మోదీ అభిమానులు సోషల్ మీడియాను వీడొద్దంటూ ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తులు చేస్తున్నారు.
మోదీ జీ అలా చేయొద్దు- ట్రెండింగ్లో '#నో సర్'
"మోదీ జీ.. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మిమ్మల్ని ప్రేమిస్తారు. కావాలంటే సోషల్ మీడియా నుంచి విరామం తీసుకోండి. కానీ తిరిగి రండి." - మోదీ అభిమాని
"నేను నరేంద్ర మోదీ అభిమానిని. ఆయన వదిలేస్తే.. నేను సోషల్ మీడియా జోలికి వెళ్లను."- ఓ ట్విట్టర్ వినియోగదారుడు
సోషల్ మీడియా రారాజు...
ప్రధాని మోదీని ట్విట్టర్‌లో 5.33 కోట్ల మంది, ఫేస్‌బుక్‌లో 4.4 కోట్ల మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 3.52 కోట్ల మంది, యూట్యూబ్‌లో 4.5 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.