తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పార్లమెంట్​ సమావేశాలకు ఆ ఎంపీలు దూరం! - parliament monsoon session amid covid fear

కరోనా భయంతో పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలకు దూరంగా ఉండాలని పలువురు ఎంపీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా లెఫ్ట్​ , టీఎంసీ సభ్యులు సమావేశాలకు దూరం కానున్నారని రాజకీయ వర్గాల సమాచారం. కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్​​ సహా సీనియర్​ నేతలు సైతం సమావేశాలకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

Several MPs may miss monsoon session amid Covid fear
పార్లమెంట్​ సమావేశాలకు పలువురు ఎంపీలు దూరం!

By

Published : Sep 12, 2020, 11:20 AM IST

పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. అయితే.. కరోనా వైరస్​ భయంతో పలువురు ఎంపీలు ఈ సమావేశాలకు దూరంగా కానున్నారని సమాచారం. కరోనా బారిన పడకుండా ఉండేందుకు సమావేశాలకు దూరంగా ఉండాలని భావిస్తోన్న ఎంపీల్లో ఎక్కువ మంది లెఫ్ట్​, టీఎంసీ పార్టీలకు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది.

సోనియా, మన్మోహన్​..

కాంగ్రెస్​ సీనియర్​ నేత, మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​(87).. సమావేశాల తొలిరోజు హాజరై మిగతా రోజులు గైర్హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు కాంగ్రెస్​ వర్గాలు తెలిపాయి. అదే విధంగా ప్రస్తుతం వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లిన కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా సమావేశాలకు హాజరుకారని వెల్లడించాయి. వారితో పాటు ఏకే ఆంటోనీ, వయలార్​ రవి వంటి సీనియర్​ నేతలు రెగ్యులర్​గా హాజరుకాలేమని ఇప్పటికే సూత్రప్రాయంగా వెల్లడించారు.

రిస్క్​ ఉన్నవారు..

ఇతర సీనియర్​ చట్టసభ్యులు ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్నవారు, వైరస్​ బారినపడే ప్రమాదం అధికంగా ఉన్నవారు కూడా పార్లమెంట్​ సమావేశాలకు దూరమవనున్నట్లు తెలుస్తోంది.

ప్రత్యేక ఏర్పాట్లు..

కరోనా నేపథ్యంలో పార్లమెంట్​ సమావేశాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. లోక్​సభలో 257 మంది, గ్యాలరీలో 172 మంది సభ్యులు కూర్చునేలా సీట్లు ఏర్పాటు చేశారు. రాజ్యసభలో 60 మంది సభ్యులు హాల్​లో, 51 మంది గ్యాలరీలో కూర్చునేలా సీటింగ్​ ఏర్పాట్లు చేపట్టారు.

పార్లమెంట్​ సమావేశాలకు సభ్యులను ఆన్​లైన్​ లేదా భౌతికంగా హాజరయ్యేందుకు అనుమతించాలని కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్​ సూచించింది. కానీ, దానిపై ప్రభుత్వం స్పందించలేదు.

ఇదీ చూడండి:పరీక్షలు చేయించుకుంటేనే పార్లమెంటులోకి అనుమతి

ABOUT THE AUTHOR

...view details