తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లాక్​డౌన్​ నిబంధనల ఉల్లం'ఘను'లకు విధించే శిక్షలివే.. - లాక్​డౌన్​ నిబంధనలు

దేశ వ్యాప్తంగా మే 3 వరకు లాక్​డౌన్​ను​ పొడిగస్తూ ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. లాక్​డౌన్​ రెండో దఫాలో కొన్ని రంగాలకు మినహయింపు ఇస్తూ మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్రం. వాటిని ఉల్లంఘించినవారికి విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం జరిమానాల నుంచి జైలు వరకు పలు శిక్షలను విధించే అవకాశం ఉంది. అవేంటో చూద్దాం.

Several coronavirus lockdown restrictions to be eased from Apr 20 to open up economy; spitting to be a punishable offence
లాక్​డౌన్​ నిబంధనల ఉల్లం'ఘను'లకు విధించే శిక్షలివే..

By

Published : Apr 16, 2020, 4:20 AM IST

లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. లాక్​డౌన్​ ముగిసే వరకు అన్ని రకాల విమాన సర్వీసులు, రైళ్లు,బస్సులు, మెట్రో రైలు సేవలను రద్దు చేసింది. అయితే ఈ నెల 20 నుంచి కొన్ని రంగాలకు మినహాయింపులు ఇస్తున్నట్లు ప్రకటించింది. లాక్‌డౌన్‌ సమయంలో ఆయుష్ ఆస్పత్రులు, అన్ని నర్సింగ్ హోమ్‌లు, వెటర్నరీ ఆస్పత్రులు, క్లీనిక్‌లు, టెలీమెడిసిన్‌ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. డిస్పెన్సరీలు, మెడికల్ షాపులు, వైద్య పరికరాల దుకాణాలు తెరిచే ఉంటాయని చెప్పింది. ఔషధ తయారీ సంస్థలు, ప్రాణవాయువు సరఫరా కేంద్రాలు, ఔషధాల ముడిపదార్థాలు తయారీ పరిశ్రమలు కొనసాగుతాయని కేంద్రం తెలిపింది.

వ్యవసాయ రంగం...

అన్ని రకాల వ్యవసాయ, ఉద్యానవన రంగాల కార్యకలాపాలు జరుగుతాయని మార్గదర్శకాల్లో కేంద్రం తెలిపింది. రైతులు, వ్యవసాయ కూలీలు, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, కనీస మద్దతు ధర కల్పించే కార్యకలాపాలు ఉంటాయని వివరించింది. రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రభుత్వాలు గుర్తించిన మండీలకు అనుమతినిస్తున్నట్లు తెలిపింది.

  • చేపలు, రొయ్యలు, మత్స్య ఉత్పత్తులు, విత్తనాల రవాణాకు అనుమతినిచ్చింది. అంతేకాకుండా ఈ రంగంలోని కార్మికులకు పనిచేసేందుకు అనుమతి లభించింది.
  • టీ, కాఫీ, రబ్బరు తోటలు గరిష్ఠంగా 50 శాతం కార్మికులతో సాగు చేసుకోవచ్చు. టీ, కాఫీ, రబ్బరు, కాజూ ఉత్పత్తుల క్రయవిక్రయాలు గరిష్ఠంగా 50 శాతం ఉద్యోగులతో పని చేయడానికి వీలు కల్పించింది.
  • పాలకు సంబంధించిన వ్యాపారాలు, పాల ఉత్పత్తుల రవాణా, పౌల్ట్రీ వంటి పశుసంవర్థక ఫామ్‌ల నిర్వహణకు అనుమతినిచ్చింది.

ఆర్థిక రంగం...

  • ఆర్థిక రంగంలో.. రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్ ఇండియా, ఆర్​బీఐ క్రమబద్ధీకరించిన ఎన్​పీసీఐ, సీసీఐఎల్​ వంటి ఆర్థిక మార్కెట్లు పనిచేస్తాయి.
  • బ్యాంకులు, ఏటీఎంలు, సెబీ కార్యకలాపాలు కొనసాగుతాయి. ఐఆర్​డీఐఏ, బీమా కంపెనీలు పనిచేస్తాయి.
  • పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, నిరాశ్రయులు, వితంతువులు, మహిళల ఆశ్రమాల నిర్వహణకు అనుమతించింది. పింఛన్ల పంపిణీ కొనసాగుతుందని కేంద్రం తెలిపింది.
  • అంగన్​వాడీలకు లబ్ధిదారులు హాజరు కాకుండా... 15 రోజులకు ఒకసారి లబ్ధిదారుల ఇంటివద్దకే ఆహార, పోషక పదార్థాలను పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేసింది.

విద్యా రంగం...

  • అన్ని రకాల విద్యాసంస్థలు, శిక్షణ, కోచింగ్‌ సంస్థల మూసివేత కొనసాగుతుంది. అయితే ఆన్‌లైన్‌ తరగతుల ద్వారా షెడ్యూల్​ను నిర్వహించుకోవాలని సూచించింది.
  • దూరదర్శన్ సహా ఇతర విద్యాపరమైన చానెల్స్‌లో... ఆన్‌లైన్ తరగతుల నిర్వహించనున్నారు.
  • భౌతిక దూరం పాటించడం సహా మాస్కులు ధరించడాన్ని కఠినంగా అమలు చేస్తూ ఉపాధి హామీ పనులకు అనుమతిచ్చింది.
  • వంటగ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ సరఫరా కొనసాగనుంది. పోస్టల్‌ సర్వీసులు కొనసాగుతాయి.
  • మున్సిపాలిటీలు, స్థానిక సంస్థల్లో నీరు, పారిశుద్ధ్యం, వ్యర్థపదార్థాల నిర్వహణ యథాతథంగా కొనసాగుతాయి.
  • అన్ని రకాల గూడ్సు సేవలు అందుబాటులో ఉంటాయి. హైవేలపై దాబాలు, వాహన మరమ్మతుల దుకాణాలు తెరుచుకోవచ్చు.
  • నిత్యావసర సరుకుల సరఫరాకు అనుమతించారు. చిన్న కిరాణా దుకాణాలు అందుబాటులో ఉంటాయన్న కేంద్రం, తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని పేర్కొంది.
  • ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా, డీటీహెచ్‌, కేబుల్‌ సేవలు యథాతథంగా ఉంటాయి.
  • ఐటీ సంస్థలు, ఐటీ సేవలకు 50శాతం సిబ్బందితో నిర్వహణకు అనుమతినిచ్చింది.
  • ఈ కామర్స్‌ సంస్థలు, వాటి వాహనాలకు అనుమతినిచ్చిన కేంద్రం, కొరియర్‌ సర్వీసులు కూడా అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
  • ఎలక్ట్రీషియన్లు ఐటీ రిపేర్లు, ప్లంబర్లు, మోటార్ మెకానిక్‌లు, కార్పెంటర్లు పనుల్లోకి వెళ్లవచ్చు.

వైద్య రంగం...

  • వైద్య సేవలు, వెటర్నరీ అవసరాలు, నిత్యావసర వస్తువులు కోసం ప్రైవేటు వాహనాలకు అనుమతించింది.
  • కార్లు వంటి వాహనాల్లో డ్రైవర్‌తో పాటు కేవలం ఒక వ్యక్తికే మాత్రమే అనుమతి ఉందని అది కూడా వెనక సీట్లో మాత్రమే కూర్చోవాలని తెలిపింది. ద్విచక్ర వాహనాలపై ఒక్కరు మాత్రమే వెళ్లాలని సూచించింది.
  • ఆరోగ్య శాఖ ఆదేశించిన వ్యక్తులు తప్పనిసరిగా క్వారంటైన్‌లోనే ఉండాలి.

ఆంక్షలను అతిక్రమిస్తే జైలుకే...

విపత్తు నిర్వహణ చట్టం -2005 కింద జారీ చేసిన ఈ లాక్‌డౌన్‌ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారికి జైలు శిక్ష విధించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు లాక్‌డౌన్ మార్గదర్శకాల్లో ఈ విషయాన్ని పొందుపరిచింది. ప్రకృతి వైపరీత్య చట్టంలోని.. సెక్షన్‌ 51 నుంచి 60 వరకు ఉన్న నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవచ్చని కేంద్రం తెలిపింది.

  • విధుల్లో ఉన్న సిబ్బంది పనులకు ఆటంకం కలిగిస్తే ఏడాది వరకు జైలు, జరిమానా లేదంటే.. రెండూ విధించవచ్చు.
  • పనులను అడ్డుకోవడం వల్ల ప్రాణనష్టం కలిగితే రెండేళ్ల వరకు జైలుశిక్ష విధించవచ్చు.
  • డబ్బు, వస్తువులు దుర్వినియోగం చేస్తే రెండేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా ఉంటుంది.
  • తప్పుడు హెచ్చరికలు జారీ చేస్తే ఏడాది వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు.
  • ప్రభుత్వ శాఖలు ఉద్యోగులు ఉల్లంఘిస్తే ఆ విభాగానికి నేతృత్వం వహించే వారు బాధ్యత వహించాల్సి ఉంటుంది.
  • విధుల్లో అధికారి విఫలమైనా, నిబంధనలకు విరుద్ధంగా కుట్రపూరితంగా వ్యవహరించినా .. ఏడాది వరకు జైలు శిక్ష, జరిమానా ఉంటుంది.
  • సంస్థలు తప్పులు చేస్తే అందుకు బాధ్యులైన ఆ సంస్థ డైరక్టర్‌, మేనేజర్‌, కార్యదర్శి, ఇతర అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు.
  • అధీకృత ప్రభుత్వ అధికారులు ఫిర్యాదు చేస్తే తప్ప ఈ నేరాలను కోర్టులు పరిగణలోకి తీసుకోకూడదు.
  • ప్రభుత్వ అధికారి జారీ చేసిన ఉత్తర్వులను ఎవరైనా ధిక్కరించి అడ్డంకులు సృష్టించినా గాయాలకు కారణమైనా చట్టపరంగా ఉద్యోగం చేస్తున్న వారికి అడ్డంకులు సృష్టించినా ఐపిసి సెక్షన్‌ 188 ప్రకారం నెల రోజుల జైలు శిక్ష, జరిమానా లేదంటే రెండూ విధించవచ్చు.

ABOUT THE AUTHOR

...view details