కరోనా మహమ్మారి దృష్ట్యా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను సొంతిళ్లకు తీసుకొచ్చేందుకు.. కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ను మే 7న ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా 17.22 లక్షల మంది స్వదేశానికి చేరుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
అక్టోబర్లో 1873 విమానాలు
వందే భారత్ మిషన్లో భాగంగా అక్టోబర్లో భారత్ నుంచి 25 దేశాలకు 1,875 విమానాలు నడిచాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ 25 దేశాల్లో 14 దేశాలు భారత్తో ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకున్నవేనని మీడియాతో జరిపిన వర్చువల్ సమావేశంలో వివరించారు.