తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గ్రూపుల మధ్య తగాదా- యాసిడ్​ దాడిలో ఏడుగురికి గాయాలు - సైనత్​ నగర్​

మహారాష్ట్ర భివండీలో దారుణం జరిగింది. ఏదో అంశంలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది. అనంతరం ఒక సమూహం మరో గ్యాంగ్​పై యాసిడ్​ దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి.

Seven suffer burn injures in acid attack in Maharashtra's Bhiwandi
యాసిడ్​ దాడిలోగాయపడ్డ వ్యక్తులు

By

Published : Oct 10, 2020, 1:43 PM IST

రెండు గ్రూపుల మధ్య తగాదా.. యాసిడ్​ దాడికి దారితీసింది. ఏదో అంశంలో గొడవపడిన అనంతరం ఒక గ్యాంగ్​ మరో సమూహంపై యాసిడ్​ దాడి చేసింది. మహారాష్ట్ర భివండీలోని సైనత్​ నగర్​లో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఏడుగురికి గాయాలయ్యాయి. వారందరినీ ఇందిరా గాంధీ సబ్​ డిస్ట్రిక్ట్​ ఆస్పత్రికి తరలించారు.

వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేసిన దుండగులను గుర్తించే పనిలో పడ్డారు.

ABOUT THE AUTHOR

...view details