గర్భిణీని ఆసుపత్రికి తీసుకువెళ్లే క్రమంలో కర్ణాటక కలబురిగిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నగర శివారులోని రహదారిపై కారును లారీ ఢీ కొన్న ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
లారీని ఢీ కొట్టిన కారు- ఏడుగురు మృతి - కలబురిగిలో ప్రమాదం
కర్ణాటక కలబురిగిలో ఘోర ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీ కొన్న ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. నగర శివారులో ఈ ఘటన జరిగింది.
లారీని ఢీ కొట్టిన కారు- ఏడుగురు మృతి
చనిపోయిన వారు అలందా ప్రాంతానికి చెందినవారుగా తెలుస్తోంది. గర్భిణీకి నొప్పులు రావడం వల్ల ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. కలబురిగి పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.