తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తమిళనాడులో గోడ కూలి.. 16 మంది మృతి - tamilnadu houses collapse

seven-killed-in-multiple-house-collapse-in-a-residential-colony-in-nadur-near-mettupalayam-in-coimbatore-districts
తమిళనాడులో కూలిన భవనం.. 10 మంది మృతి

By

Published : Dec 2, 2019, 8:21 AM IST

Updated : Dec 2, 2019, 10:36 AM IST

10:34 December 02

తమిళనాడులో ఘోరవిషాదం చోటుచేసుకుంది. కోయంబత్తూరులోని మెట్టుపాళ్యంలో భారీ వర్షానికి ఓ ప్రహరీ గోడ పక్కనే ఉన్న ఇళ్లపై కూలింది.  ఈ ఘటనలో వరుసగా ఉన్న నాలుగు ఇళ్లు పేకమేడలా కుప్పకూలాయి. 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ సహా ఇతర శాఖల సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.

వరద హెచ్చరికలు...

కుండపోత వర్షాలకు తమిళనాడులోని భవాని నది పొంగి పొర్లుతోంది. నదిపై కట్టిన రిజర్వాయర్​లో నీటి నిల్వ పూర్తి సామర్థ్యానికి చేరింది. నది పరివాహక ప్రాంతాల ప్రజలకు వరదల హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
 

09:31 December 02

16కు చేరిన మృతులు...

ప్రహరీ గోడ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 16కు చేరింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద మరికొంత మంది ఉన్నట్లు సమాచారం.

08:15 December 02

తమిళనాడులో గోడ కూలి.. 16 మంది మృతి

తమిళనాడులో కూలిన భవనం

తమిళనాడులో వర్షాలు బీభత్సం సృష్టించాయి. కోయంబత్తూరు జిల్లా మెట్టుపాళ్యంలో భారీ వర్షానికి ఓ ప్రైవేటు భవనానికి చెందిన ప్రహరీ గోడ కూలి 4 ఇళ్లు పేకమేడలా కుప్పకులాయి. ఈ దుర్ఘటనలో నలుగురు మహిళలు సహా 15 మంది దుర్మరణం చెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం సహాయ బృందాలను రంగంలోకి దించింది. సహాయకచర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

Last Updated : Dec 2, 2019, 10:36 AM IST

ABOUT THE AUTHOR

...view details