మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లోని ఓ మూడంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి ఏడుగురు వ్యక్తులు మరణించారు. పలువురు గాయపడ్డారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది భవనంలో చిక్కుకున్న రెండు కుటుంబాలను రక్షించారు.
"భవనంలోని రెండు రంగుల దుకాణాల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నాం. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించాం."