తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బిహార్​: పిడుగుపాటుకు ఏడుగురు చిన్నారుల మృతి - బిహార్​

బిహార్​ నవాదా జిల్లాలో పిడుగు పడి ఏడుగురు చిన్నారులతో పాటు ఓ యువకుడు మృతి చెందాడు. కొందరు పిల్లలు చెట్టుకింద ఆడుకుంటుండగా పెద్ద శబ్దంతో పిడుగుపడింది. ఘటనలో పలువురు గాయపడ్డారు.

బిహార్​: పిడుగుపడి ఏడుగురు చిన్నారుల మృతి

By

Published : Jul 19, 2019, 5:27 PM IST

Updated : Jul 19, 2019, 8:16 PM IST

విచారంలో గ్రామం

బిహార్​ నవాదా జిల్లాలో ఘోర దుర్ఘటన జరిగింది. బిహార్‌లో పిడుగుపాటుకు గురై ఏడుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. కొందరు పిల్లలు చెట్టు కింద ఆడుకుంటుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పిడుగుపడింది. ఘటనలో చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం తెలుసుకున్న గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన చిన్నారులను సర్దార్​ ఆస్పత్రికి తరలించారు. అప్పటివరకూ ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతమంతా తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో హృదయవిదారకంగా మారింది.

సీఎం దిగ్భ్రాంతి...

ఘటనపై బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన చిన్నారుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతులు ఒక్కొక్కరికి రూ. 4లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

ఇదీ చూడండి: ఇంట్లోకి వచ్చి మంచం ఎక్కిన పులి...!

Last Updated : Jul 19, 2019, 8:16 PM IST

ABOUT THE AUTHOR

...view details