తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రోజంతా శవపేటికలో.. తెరిచి చూస్తే ప్రాణంతో

చనిపోయాడనుకొన్న ఓ వ్యక్తి 24 గంటల తర్వాత ప్రాణాలతో బయటపడ్డాడు. కూలింగ్​ శవపేటికలో రోజంతా ఉంచినా బతికాడు. ఫ్రీజర్​ అద్దెకు ఇచ్చిన సంస్థ వల్ల శవపేటికలోని వృద్ధుడి ప్రాణం నిలిచింది.

freezer box
శవపేటిక

By

Published : Oct 14, 2020, 8:16 PM IST

Updated : Oct 14, 2020, 8:36 PM IST

తమిళనాడు సేలం జిల్లాలో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. మరణించిన తర్వాత ఫ్రీజర్ శవపేటికలో పెట్టినా.. 75 ఏళ్ల వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఫ్రీజర్ బాక్స్ సంస్థకు చెందిన సిబ్బంది తక్షణ స్పందన వల్ల వృద్ధుడు బతికాడు.

ఇదీ జరిగింది..

సేలంలో నివసించే బాలసుబ్రమణ్యన్​ మరణించాడని భావించి అతని సోదరుడు శరవణన్.. సోమవారం ఫ్రీజర్​ బాక్స్​ను అద్దెకు తీసుకున్నాడు. ఆ బాక్స్​ను తిరిగి తీసుకెళ్లేందుకు మంగళవారం రావాలని సంస్థ ప్రతినిధులకు సూచించాడు. అలా వచ్చిన సిబ్బంది.. అందులోని వ్యక్తి ఊపిరితీసుకోవడాన్ని గమనించారు. వెంటనే ఆ ఫ్రీజర్​ నుంచి బాలసుబ్రమణ్యన్​ను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.

రోజంతా శవపేటికలో.. తెరిచి చూస్తే ప్రాణంతో

పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. సోదరుల మధ్య ఆస్తి వివాదం నడుస్తోందని తెలిసింది. ఇది హత్యాయత్నమని పోలీసులు అనుమానిస్తున్నారు. శరవణన్​పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి:బిడ్డకు జన్మనిచ్చిన 14 రోజులకే విధుల్లోకి కలెక్టర్​

Last Updated : Oct 14, 2020, 8:36 PM IST

ABOUT THE AUTHOR

...view details