ఇటీవల వెలుగు చూసిన టెలివిజన్ రేటింగ్స్ పాయింట్స్(టీఆర్పీ) కుంభకోణంలో రిపబ్లిక్ టీవీ డిస్ట్రిబ్యూషన్ హెడ్ ఘనశ్యామ్ సింగ్ను ముంబయి క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును విచారిస్తున్న క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్ (సీఐయూ) ఇప్పటివరకు 11 మందిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా... తాజా అరెస్టుతో ఆ సంఖ్య 12కు చేరింది. ఘనశ్యామ్ను సీఐయూ పలు దఫాలుగా విచారించిందని అధికారులు వెల్లడించారు.
నకిలీ టీఆర్పీ కేసులో రిపబ్లిక్ టీవీ ప్రతినిధి అరెస్ట్ - ghanasyam Singh of republic tv arrest
టీఆర్పీ అవకతవకలకు సంబంధించి ముంబయి పోలీసులు మరో వ్యక్తిని అరెస్టు చేశారు. రిపబ్లిక్ టీవీకి చెందిన డిస్ట్రిబ్యూషన్ హెడ్ ఘనశ్యామ్ సింగ్ను ఈ రోజు ఉదయం అదుపులోకి తీసుకున్నట్లు క్రైం బ్రాంచ్ పోలీసులు తెలిపారు.
నకిలీ టీఆర్పీ కేసులో రిపబ్లిక్ టీవీ ప్రతినిధి అరెస్ట్
టీఆర్‌పీల విషయంలో కొన్నిఛానళ్లు మోసాలకు పాల్పడుతున్నాయని బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బార్క్) ఇప్పటికే పలు మీడియా సంస్థలపై కేసులు నమోదు చేసింది. కొంతమందికి డబ్బులు ఇచ్చి... తమ ఛానళ్లు చూసేలా చేస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి.