తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐసీఎంఆర్​ సీనియర్ శాస్త్రవేత్తకు కరోనా - corona latest news

భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్​) సీనియర్ శాస్త్రవేత్తకు కరోనా పాజిటివ్​గా తేలినట్లు కార్యాలయ వర్గాలు తెలిపాయి. కొద్ది రోజుల క్రితం ఆయన ముంబయి నుంచి దిల్లీ వచ్చారని, ఆదివారం ఉదయం వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయిందని పేర్కొన్నారు.

Senior ICMR scientist tests positive for coronavirus
ఐసీఎంఆర్​ సీనియర్ శాస్రవేత్తకు కరోనా పాజిటివ్​

By

Published : Jun 1, 2020, 2:18 PM IST

కరోనా బారిన పడుతున్న వారి జాబితాలోకి శాస్త్రవేత్తలు కూడా చేరుతున్నారు. భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్​) సీనియర్ శాస్తవేత్త ఒకరికి వైరస్​ సోకినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ముంబయి నుంచి కొద్దిరోజుల క్రితమే ఆయన దిల్లీ వచ్చారని, ఆదివారం ఉదయం కరోనా నిర్ధరణ అయిందని చెప్పాయి.

ఈ విషయం తెలిసిన వెంటనే ఐసీఎంఆర్ ప్రధాన కార్యాలయాన్ని క్రిమిసంహారకాలతో శుద్ధి చేయిస్తున్నారు. రెండు రోజులు ఎవరూ కార్యాలయానికి రావద్దని, ఇంటి నుంచే పనిచేయాలని అధికారులు సూచించినట్లు సమాచారం. కొవిడ్​-19 కీలక బృందంలోని సభ్యులు అత్యవసరమైతేనే కార్యాలయానికి రావాలని పారిపాలనా విభాగం ఉద్యోగులకు సందేశం పంపినట్లు తెలుస్తోంది.

ఐసీఎంఆర్ డైరెక్టర జనరల్​ డా.బలరాం భార్గవ సహా మరికొంత మంది పాల్గొన్న సమావేశానికి గతవారం హాజరయ్యారు కరోనా సోకిన శాస్త్రవేత్త.

నీతి ఆయోగ్ అధికారికి కూడా కరోనా సోకింది. దిల్లీలోని కార్యాలయం మూడో అంతస్తును సీల్ చేసి శుద్ధి చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details