తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నిజాయతీకి బదిలీ బహుమానం-ఖేమ్కా.. 53వ సారి - ashok khemka

ముక్కుసూటిగా వెళ్లే ఐఏఎస్ అధికారి అశోక్​ ఖేమ్కా మరోసారి బదిలీ బహుమానం అందుకున్నారు. హరియాణా కేడర్​కు చెందిన 1991 బ్యాచ్ ఐఏఎస్ ఖేమ్కా తాజాగా 53వసారి బదిలీ అయ్యారు.

khemka
నిజాయతీకి బదిలీ బహుమానం-ఖేమ్కా.. 53వ సారి

By

Published : Nov 28, 2019, 8:41 AM IST

'అవమానమే నిజాయతీకి బహుమతి'’ అని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అశోక్‌ ఖేమ్కా అన్నారు. ఈ ఏడాది మార్చిలోనే హరియాణా రాష్ట్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా చేరిన ఆయన... తాజాగా ఆర్కియాలజీ-మ్యూజియం విభాగ ముఖ్య కార్యదర్శిగా బదిలీ అయ్యారు. తన బదిలీపై స్పందిస్తూ ‘'మళ్లీ అదే జరిగింది. నిన్న రాజ్యాంగ దినోత్సవం జరిగింది. నేడు సుప్రీంకోర్టు ఆదేశాల ఉల్లంఘన జరిగింది. కొందరికి ఇది సంతృప్తి కలిగించవచ్చు. నిజాయతీకి అవమానమే బహుమానం'’’ అని పేర్కొన్నారు.

అశోక్​ ఖేమ్కా ట్వీట్

1991-బ్యాచ్‌ కేడర్‌కు చెందిన అశోక్​ ఇప్పటివరకూ 52 సార్లు బదిలీ అయ్యారు. ఖేమ్కా సహా మరో 14 మంది ఐఏఎస్‌లను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం బదిలీ చేసింది.

ఇదీ చూడండి: 27 ఏళ్లలో 52 బదిలీలు

ABOUT THE AUTHOR

...view details