వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ఎన్నికల సంఘం ముమ్మరం చేస్తోంది. తమిళనాడు, పుదుచ్చేరిలకు ఈసీ సెక్రటరీ జనరల్ ఉమేష్ సిన్హాను పంపనుంది.
సోమ, మంగళవారాల్లో తమిళనాడులో..బుధవారం పుదుచ్చేరిలో ఉమేష్ సిన్హా గడపనున్నారని అధికార వర్గాల సమాచారం. కరోనా నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలను ఆయన అంచనా వేయనున్నారు.