తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఇంద్రుడి సింహాసనం ఇచ్చినా భాజపాతో కలిసేది లేదు' - sena to be meet governor koshyari

భాజపాతో శివసేన పొత్తు వార్తలపై స్పందించారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్.  ఇంద్రుడి సింహాసనం ఇచ్చినా కాషాయదళంతో కలిసేది లేదని తెగేసి చెప్పారు. నేడు మహారాష్ట్ర గవర్నర్​ భగత్​సింగ్ కోశ్యారీతో శివసేన, ఎన్​సీపీ, కాంగ్రెస్ నేతలు భేటీ కానున్నారు.

'ఇంద్రుడి సింహాసనం ఇచ్చినా భాజపాతో కలిసేది లేదు'

By

Published : Nov 22, 2019, 10:48 AM IST

భాజపాతో కలిసేది లేదని తేల్చి చెప్పారు శివసేన ఎంపీ సంజయ్​ రౌత్. ఇంద్రుడి సింహాసనం ఇచ్చినా భాజపాతో పొత్తు పెట్టుకోబోమని వ్యాఖ్యానించారు. శివసేన, ఎన్​సీపీ, కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రి పదవి తమదేనని ఉద్ఘాటించారు.

"ఆఫర్లకు సమయం పూర్తయ్యింది. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్​ ఠాక్రేను ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని మహారాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు."

-సంజయ్​ రౌత్, శివసేన ఎంపీ

సేన, ఎన్​సీపీ, కాంగ్రెస్​ నేతలు మరికొద్దిసేపట్లో మహారాష్ట్ర గవర్నర్ భగత్​సింగ్ కోశ్యారీతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్​ను ఎందుకు కలవాలని అనుకుంటున్నారు అన్న విలేకరుల ప్రశ్నకు పైవిధంగా జవాబిచ్చారు రౌత్.

ఇదీ చూడండి: నౌకాదళంలో తొలి మహిళా పైలట్​ శివాంగి

ABOUT THE AUTHOR

...view details