తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఎడారి రాజ్యంలో ఎందుకీ రాజకీయ దుస్సాహసం?' - shiva sena latest news

రాజస్థాన్​లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో భాజపాపై విమర్శలు చేసింది శివసేన. ఎడారి రాజ్యంలో అలజడి సృష్టించి భాజపా ఏం సాధించబోతుందని ప్రశ్నించింది. ప్రత్యర్థి పార్టీల ప్రభుత్వాలను అస్థిరపరచడమే మోదీ సర్కార్ పనిగా పెట్టుకుందని దుయ్యబట్టింది.

Sena targets BJP over political storm in Rajasthan
'ఏం సాధించేందుకు ఎడారి రాజ్యంలో ఈ రాజకీయ దుస్సాహసం'

By

Published : Jul 14, 2020, 12:55 PM IST

ప్రత్యర్థి పార్టీల ప్రభుత్వాలను అస్తిరపరిచేందుకు, కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల కొనుగోలును ప్రోత్సహించేందుకే ఎన్​డీఏ పనిచేస్తోందని ఆరోపించింది శివసేన. రాజస్థాన్​లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో తన అధికార పత్రిక సామ్నా వేదికగా భాజపాపై విరుచుకుపడింది. ఎడారి రాజ్యంలో ఏమి సాధించేదుకు ఈ రాజకీయ దుస్సాహసానికి పాల్పడుతున్నారని ప్రశ్నించింది. అలాంటి చర్యల వల్ల పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఎడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

" కేంద్రంలోని అధికార పక్షం... ప్రత్యర్థుల నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు పని చేస్తోంది. కరోనా వైరస్​ సంక్షోభంతో ఆర్థిక వ్యవస్థ పతనం సహా చైనా చొరబాట్ల సమస్యలను దేశం ఎదుర్కొంటున్న వేళ ఆ సమస్యలను పరిష్కరించకుండా.. కాంగ్రెస్​లోని అంతర్గత కలహాలలో భాజపా కలుగజేసుకుంటోంది. రాజస్థాన్​లో ఎమ్మెల్యేల కొనుగోలును ప్రోత్సహిస్తోంది.

భాజపా దేశం మొత్తాన్ని పాలిస్తోంది. కొన్ని రాష్ట్రాలను విపక్షాలకు వదిలేయాలి. అది ప్రజస్వామ్యం గొప్పతనం. మధ్యప్రదేశ్​లో కమల్​నాథ్​ ప్రభుత్వాన్ని కూల్చిన తర్వాతే.. రాజస్థాన్​ ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తుందని ముందుగానే అంచనా వేశాం. జోతిరాధిత్య సింధియా దారిలోనే సచిన్​ పైలట్ వెళతారని ఊహించాం. అదే జరిగింది. "

- శివసేన

అశోక్​ గహ్లోత్​ ప్రభుత్వం మైనారిటీలో ఉందని పైలట్​ పేర్కొనటాన్ని తోసిపుచ్చింది శివసేన. అది అసెంబ్లీలో తేలుతుందని పేర్కొంది. ​

ఇదీ చూడండి: మరోసారి రాజస్థాన్​ సీఎల్పీ భేటీ.. కొలిక్కిరాని బుజ్జగింపులు

ABOUT THE AUTHOR

...view details