మహారాష్ట్రలో మరో ఐదేళ్లు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని పేర్కొన్నారు భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్. లోక్సభ ఎన్నికలకు ముందే పొత్తు కుదిరితే.. సీఎం పదవిని చెరిసగం పంచుకోవాలన్న ప్రతిపాదనకు శివసేన అంగీకరించలేదన్నారు.
శివసేనకు సీఎం పదవి ఇచ్చే అంశంపై తమ పార్టీ అధ్యక్షుడు ఎలాంటి హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు.
మహాయుతి(కూటమి) ప్రభుత్వానికి స్థిరమైన, సమర్థవంతమైన నాయకత్వం భాజపానే వహిస్తుందని వ్యాఖ్యానించారు. పార్టీ శాసనసభాపక్ష నేత ఎన్నిక బుధవారం ఉంటుందని వెల్లడించారు ఫడణవీస్. మోదీ ఇప్పటికే పేరు ప్రకటించారని.. సమావేశం నామమాత్రమేనన్నారాయన. ఈ సందర్భంగా.. ఎన్నికల ప్రచార సమయంలో కూటమికి ఫడణవీస్ నాయకత్వం వహించనున్నారని మోదీ చేసిన వ్యాఖ్యలను ఉదహరించారు.
రాష్ట్రంలో అధికారాన్ని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలన్న శివసేన డిమాండ్ నేపథ్యంలో ఫడణవీస్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇదీ చూడండి:భాజపాపై శివసేన నేత కీలక వ్యాఖ్యలు