తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన సంచలన వ్యాఖ్యలు - Shiv Sena leader Sanjay Raut

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు శివసేన సీనియర్​ నాయకుడు సంజయ్ ​రౌత్​. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోలేకపోతే శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. అధికారం కోసం తమపార్టీ.. రాజకీయంగా వ్యాపారాలు చేయదని స్పష్టం చేశారు.

ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన సంచలన వ్యాఖ్యలు

By

Published : Nov 10, 2019, 2:27 PM IST

శివసేన సీనియర్​ నేత సంజయ్​ రౌత్​ మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే శివసేన ఆ పని చేస్తుందని స్పష్టం చేశారు. తమపార్టీ ఎప్పుడూ.. రాజకీయంగా వ్యాపారాలు చేయదన్న ఆయన.. ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన అధ్యక్షుడిదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. కాంగ్రెస్​, ఎన్​సీపీ నాయకులతో శివసేన పార్టీ ఒప్పందం చేసుకుందన్న వ్యాఖ్యలపైనా స్పందించారు రౌత్​.

"ఒప్పందం చేసుకోవటానికి మా నాయకుడు వ్యాపారి కాదు. ఒప్పందం అనేది వ్యాపారానికి సంబంధించిన విషయం. శివసేన ఎప్పుడూ కూడా రాజకీయాలతో వ్యాపారం చేయలేదు. శివసేనకు ప్రభుత్వం ఏర్పాటు చేయడమంటే....లాభనష్టాలు, ఆస్తి అప్పులు కాదు. భాజపా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుంటే.. మేం తప్పకుండా ఆ పని చేస్తాం."
-సంజయ్​ రౌత్​, శివసేన సీనియర్​ నాయకుడు.

కాంగ్రెస్​ మద్దతు!

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేనకు కాంగ్రెస్​ మద్దతిస్తుందని వెల్లడించారు రౌత్​. హస్తం పార్టీ 'మహారాష్ట్రానికి శత్రువు ఏమీ కాదని' పేర్కొన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్​ నాయకులు ఏ నిర్ణయం తీసుకున్నా.. శివసేన స్వాగతిస్తుందని తెలిపారు.

ఇదీ చూడండి:హెచ్​1బీ వీసాదారులకు అమెరికా కోర్టులో ఊరట

ABOUT THE AUTHOR

...view details